ఆదాని గ్రూప్ కు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ షాక్ ఇచ్చింది. గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ సంస్థల ఖాతాలను స్థంబింపజేసింది. దీంతో ఆదానీ గ్రూప్ కు చెందిన షేర్లు భారీగా నష్టపోయాయి. గంట వ్యవధిలోనే ఆదానీ గ్రూప్‌కూ 7.6 బిలియన్ డాలర్లు నష్టపోయింది. స్థంబింపజేసిన మూడు విదేశీ సంస్థలకు ఆదానీ గ్రూప్‌లో దాదాపుగా రూ.43,500 కోట్ల విలువైన షేర్లు ఉన్నాయి. కొత్త మార్కెట్ నిబంధనల ప్రకారం, ఈ ఖాతాలకు చెందిన యాజమాన్యాల పూర్తి వివరాలను అందజేయాల్సి ఉంటుంది. కానీ, పూర్తి వివరాలను అందజేయకపోవడంతో ఖాతాలను స్థంబింపజేసింది ఎన్ఎస్‌డీపీ. ఖాతాలు స్థంభించడంతో ఆదానీ గ్రూప్ షేర్లు 25 శాతం మేర నష్టపోయాయి.
గంటలో రూ.55 వేల కోట్లు నష్టం…
