Site icon NTV Telugu

Aadhaar Update: ఇదేందయ్యా ఇది.. అపార్ట్‌మెంట్స్, రెస్టారెంట్లలోకి వెళ్లాలంటే ఆధార్‌ కావాల్సిందేనా..?

Aadhar

Aadhar

Aadhaar Update: ఆధార్ లో కీలక మార్పులు దిశగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. దీంతో హోటల్‌, రెస్టారెంట్, అపార్ట్‌మెంట్‌ ఇలా ఎక్కడికి వెళ్లినా ఆధార్‌ యాక్సెస్‌ తప్పనిసరి అయ్యే ఛాన్స్ ఉంది. ఆ దిశగా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా త్వరలో నూతన విధానం తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. అదే ఆఫ్‌లైన్‌ వెరిఫికేషన్‌.. దీనికి సంబంధించి కొత్త యాప్‌ను తీసుకొస్తున్నట్లు ఇటీవలే తెలియజేసింది. అయితే, ఇప్పుడు చాలా ప్రదేశాల్లో ఆధార్‌ కార్డు తప్పనిసరి అనే రూల్ ఉంది. అలాంటి చోట ఒరిజినల్‌ ఆధార్‌ను చూపించడంతో పాటు జిరాక్స్‌ కాపీని ఇవ్వాల్సి పరిస్థితి నెలకొంది. దీంతో వ్యక్తులకు సంబంధించిన కీలక సమాచారం దుర్వినియోగం అవుతుంది. కాబట్టి, దీన్ని నివారించానికి ఆధార్‌పై ఎలాంటి వివరాలు లేకుండా కేవలం క్యూఆర్‌ కోడ్‌, ఫొటో మాత్రమే ఉండేలా మార్పులు చేసేందుకు కేంద్రం యోచిస్తుంది. అలాగే, ఆఫ్‌లైన్‌ ఐడీ చెక్‌ను తీసుకు వస్తే ఆధార్‌ హార్డ్‌ కాపీలు చూపించాల్సిన అవసరం ఉండదని యూఐడీఏఐ పేర్కొంటుంది.

Read Also: Telangana Rising : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు భారీ ఏర్పాట్లు

కొత్త ఆఫ్‌లైన్‌ ధ్రువీకరణ వ్యవస్థ..
అయితే, UIDAI అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. కొత్త ఆఫ్‌లైన్‌ ధ్రువీకరణ వ్యవస్థను పూర్తిగా క్యూర్‌ కోడ్‌ ఆధారంగా తయారు చేస్తారు. ప్రూఫ్‌ ఆఫ్‌ ప్రజెన్స్‌ అనే కొత్త టెక్నాలజీని ఉపయోగిస్తారు. UIDAI సర్వర్లకు కనెక్ట్‌ కాకుండానే ముఖాన్ని స్కాన్‌ చేసి వ్యక్తిని ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఇది ప్రస్తుతం బ్యాంకులు ఉపయోగిస్తున్న ఫేస్‌ అథెంటికేషన్‌ కంటే భిన్నంగా ఉంటుంది. యాప్‌ రిలీజ్ అయ్యాక ఈ విధానం ఎలా వర్క్ చేస్తుందో మరింత క్లారిటీ రానుంది.

ఆఫ్‌లైన్‌ వెరిఫికేషన్‌ ఎక్కడెక్కడ?
ఇక, ఈ ఆఫ్‌లైన్‌ వెరిఫికేషన్‌ విధానం అమల్లోకి వస్తే హోటల్స్, రెస్టారెంట్లు, లాడ్జీలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, ఆఫీసులు, డేటా సెంటర్లు, హస్పటల్స్, పరీక్షల్లో విద్యార్థులు, సినిమా హాళ్లు, స్టేడియాలు, కచేరీలు.. ఇలా అనేక చోట్ల ఆధార్‌ యాక్సెస్‌తో ఎంట్రీకి ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన రూల్స్ ను UIDAI త్వరలో విడుదల చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.

Read Also: Tufail Ahmad Arrest: ఢిల్లీ కారు పేలుడు కేసులో మరొకరు అరెస్ట్.. SIA అదుపులో ఎలక్ట్రీషియన్‌

ఎవరైనా అప్లై చేసుకోవచ్చు
కాగా, చట్టపరంగా రిజిస్టర్‌ అయిన ఏ సంస్థ అయినా ఆఫ్‌లైన్‌ వెరిఫికేషన్‌ సీకింగ్‌ ఎంటీటీగా మారడానికి అవకాశం ఉంది. దాని కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్‌ బోర్డింగ్‌ ప్రక్రియలో డాక్యుమెంట్ల ధ్రువీకరణ, సాంకేతికత అనుసంధానం, క్యూఆర్‌ కోడ్‌ల జనరేషన్‌ వంటివి తప్పనిసరిగా ఉంటాయి. దీనికి నామమాత్రపు ఫీజు వసూలు చేస్తామని UIDAI వెల్లడించింది. అయితే, ప్రస్తుతానికి ఈ యాప్ టెస్టింగ్‌ అంతిమ దశలో ఉంది. త్వరలో ఇది అందుబాటులోకి రానుందని అధికారులు చెప్పారు.

Exit mobile version