Aadhaar Update: ఆధార్‌లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aadhaar Update : ప్రస్తుతం భారతదేశంలో ఆధార్ కార్డు అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రాల్లో ఒకటిగా మారింది. బ్యాంక్ ఖాతా తెరవడం నుంచి మొబైల్ సిమ్ తీసుకోవడం వరకు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడం నుంచి ఆదాయపు పన్ను సంబంధిత పనుల వరకు అనేక సేవలకు ఆధార్ అవసరమవుతోంది. చాలా మంది ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత దానిలో ఉన్న వివరాలను మళ్లీ పరిశీలించరు. అయితే చిన్న చిన్న తప్పులు కూడా భవిష్యత్తులో పెద్ద సమస్యలకు కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా పేరు, జనన తేదీ, చిరునామా, మొబైల్ నంబర్ వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి తనిఖీ చేసుకోవడం అవసరం. చాలామంది విద్యా సర్టిఫికెట్లు, పాన్ కార్డు, బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డుల్లో వేర్వేరు పేర్లు ఉంటాయి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ లో డేట్లు కూడా తప్పుగా ఉంటాయి. వీటి వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక డాక్యుమెంట్లో ఉన్న వివరాలు మరో డాక్యుమెంట్‌తో సరిపోకపోతే ధృవీకరణ ప్రక్రియల్లో ఆలస్యం జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దరఖాస్తులు తిరస్కరించబడే పరిస్థితి కూడా ఏర్పడుతుంది.
Also Read
- Elon Musk: అమెరికా పిల్లలకు మస్క్ ఫ్రీ ఆఫర్.. స్పేస్ఎక్స్ షేర్లు ఉచితం!
- Amazon Layoffs: అమెజాన్‌లో మళ్లీ లే ఆఫ్స్.. డెలివరీ విభాగంలో భారీగా కోతలు..
- Nirmala Sitharaman: స్టాక్ మార్కెట్లో లాభాలు తగ్గడానికి కారణం ఇదే.. నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు..
- DA Hike: ఉద్యోగులకు, పెన్షనర్లకు భారీ శుభవార్త.. దీపావళి కానుకగా డీఏ పెంపు..?
మొబైల్ నంబర్ అప్డేట్ చేయడం కూడా చాలా ముఖ్యమైన అంశం. ప్రస్తుతం అనేక ఆన్లైన్ సేవలు ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు ఓటీపీ పంపడం ద్వారా పనిచేస్తున్నాయి. పాత నంబర్ ఆధార్‌లో నమోదై ఉండి ప్రస్తుతం ఉపయోగంలో లేకపోతే అవసరమైన సమయంలో సేవలను పొందడంలో ఇబ్బందులు రావచ్చు. అలాగే చిరునామా మారిన వారు కూడా కొత్త వివరాలను నమోదు చేయించుకోవడం మంచిది. ముఖ్యంగా ఉద్యోగం, చదువు లేదా ఇతర కారణాలతో వేరే ప్రాంతానికి మారిన వారికి ఇది మరింత అవసరం.
ఆధార్‌కు సంబంధించిన వివరాలు సరిగా ఉన్నాయా లేదా అనేది తరచూ పరిశీలించడం ఒక మంచి అలవాటు. చిన్న పొరపాట్లు పెద్ద సమస్యలుగా మారకముందే వాటిని సరిచేసుకోవడం మంచిది. ప్రభుత్వ సేవలు, బ్యాంకింగ్ లావాదేవీలు, పన్ను సంబంధిత ప్రక్రియలు మరింత డిజిటల్‌గా మారుతున్న ఈ సమయంలో ఆధార్‌లోని సమాచారం ఖచ్చితంగా ఉండటం చాలా ముఖ్యం. అందుకే మీ ఆధార్ కార్డును ఒకసారి పరిశీలించి అవసరమైతే వివరాలను అప్డేట్ చేసుకోవడం భవిష్యత్తులో అనవసర ఇబ్బందులను నివారించగలదు.
తాజావార్తలు
-
Sharwanand: ‘భోగి’తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
-
Asian Para Games 2026 : భారత్ కు మరో స్వర్ణం.. స్ప్రింటర్ సిమ్రాన్‌కు స్వర్ణం..
-
Rajinikanth – Nayanthara: ‘ధర్మన్’లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
-
Abhjeet Dipke: ‘‘దీపావళి వరకు వద్దు’’.. CJP నిరసనలపై అభిజిత్ దీప్కే మెసేజ్..
-
Hyderabad: స్నాక్స్ తింటున్నారా..? డైరెక్ట్ యమలోకానికే.. 55 టన్నుల ఆహార పదార్థాలు సీజ్..!
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!