NTV Telugu Site icon

Whatsapp accounts: భారీగా వాట్సప్ ఖాతాలపై నిషేధం.. 84 లక్షల అకౌంట్స్ క్లోజ్

Whatsappaccounts

Whatsappaccounts

ఆన్‌లైన్ మోసాలను అరికట్టేందుకు మెటా యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే నెలలో భారీగా ఖాతాలపై నిషేధం విధించింది. ఆగస్టు నెలలో 84.58 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించినట్లు వాట్సప్ సంస్థ పేర్కొంది. వాట్సప్‌ లేని మొబైల్ లేదు. దేశంలో కోట్లాది మంది వినియోగిస్తున్నారు. ఇదే అదునుగా సైబర్‌ నేరగాళ్లు దీన్ని అడ్డాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఈ తరహా మోసాలు విపరీతంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఖాతాలపై వాట్సప్‌ నిషేధం విధించింది. ఒక్క ఆగస్టులోనే సుమారు 84.54 లక్షల ఖాతాలను బ్యాన్‌ చేసింది. తమ ప్రైవసీ పాలసీని ఉల్లంఘించినందుకు గాను ఈ చర్యలు చేపట్టినట్లు వాట్సప్‌ తెలిపింది.

ఇది కూడా చదవండి: AP Cabinet: 20 లక్షల ఉద్యోగ అవకాశాలు.. కేబినెట్‌లో చర్చకు ప్రభుత్వ నూతన పాలసీలు

ఐటీ యాక్ట్‌, 2021 నిబంధనలను అనుసరించి ఆగస్టు నెలలో భారీ సంఖ్యలో ఖాతాలపై నిషేధం విధించినట్లు వాట్సప్‌ తెలిపింది. మొత్తం 84.58 లక్షల ఖాతాలపై చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. ఇందులో సుమారు 16.61 లక్షల ఖాతాలను ముందు జాగ్రత్త చర్యగా బ్యాన్‌ చేశామని తెలిపింది. మోసానికి ఆస్కారం ఉండే బల్క్‌ మెసేజ్‌లు లేదా అసాధారణ మెసేజ్‌లను వాట్సప్‌ తన ఆటోమేటెడ్‌ సిస్టమ్‌ ద్వారా ముందుగానే గుర్తించి ఈ చర్యలు చేపట్టింది. ఆగస్టు నెలలో గ్రీవెన్స్‌ మెకానిజం ద్వారా యూజర్ల నుంచి 10,707 ఫిర్యాదులు అందినట్లు వాట్సప్‌ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: BCB: బంగ్లాదేశ్ క్రికెట్‌లో రచ్చ.. హెడ్ కోచ్ హతురుసింగ సస్పెండ్