NTV Telugu Site icon

షణ్ముఖ్ కి ముద్దు పెట్టిన సిరి.. నన్ను ఏడవమంటారా అన్న బాయ్ ఫ్రెండ్

బిగ్ బాస్ సీజన్ 5 మంచి రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. కెప్టెన్సీ టాస్క్ లు, ఎలిమినేషన్స్ సెగల మధ్య కంటెస్టెంట్ల స్నేహాలు, నవ్వులు కొంత ఉపశమనం కలిసాగిస్తున్నాయి. ఇక తాజాగా బిగ్ బాస్ హౌస్ లో సిరి, షన్నుకి ముద్దు పెట్టింది. దానికి షన్ను సిగ్గు పడడం, కెమెరాల వంక చూస్తూ అన్ని రికార్డ్ చేశారా..? ఇప్పడు ఉంటుంది నాకు అని అనడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ క్లిప్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ క్లిప్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మొత్తం ఎపిసోడ్ లో సిరి, షన్నుకి ముద్దు పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చిందని అభిమానులు ఆరా తీస్తూ సోషల్ మీడియాలో రచ్చ షురూ చేశారు.

ఇక ఈ రచ్చలోకి సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ న్ని కూడా లాగడం చర్చనీయాంశంగా మారింది. దీప్తి సునైనా బిగ్ బాస్ హౌస్ లో తనీష్ తో క్లోజ్ గా ఉండడం చూసి షన్నుని ఒక ఆట ఆదుకున్న నెటిజన్స్ ప్రస్తుతం శ్రీహన్ పై పడ్డారు. ఇక ఈ వార్తలపై తాజాగా శ్రీహన్ స్పందించాడు ” ఇప్పుడేంట్రా.. నేను ఏడవాలా.. షార్ట్ ఫిల్మ్స్ లో, సినిమాల్లో చూస్తే ఓకే కదా మీకు” అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రీహన్ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే యూట్యూబ్ స్టార్ శ్రీహన్ తో సిరికి నిశ్చితార్ధం అయిన సంగతి తెలిసిందే. మరి ఈ ఘాటు కిస్ పై షన్ను లవెర్ దీప్తి సునైనా ఎలా స్పందిస్తుందో చూడాలి.