NTV Telugu Site icon

Pallavi Prashanth: పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న బిగ్ బాస్ విన్నర్?

Pallavi Prasanth (2)

Pallavi Prasanth (2)

బిగ్ బాస్ 7 తెలుగు తెలుగు సీజన్ ఎన్నో వివాదాలకు కారణం అయ్యింది.. గ్రాండ్‌ ఫినాలే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షో నడిచింది. కానీ ఫినాలే రోజు మొత్తం పెద్ద రచ్చే జరిగింది.. విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ అభిమానులు చేసిన హంగామా వివాదాలకు కారణమైంది. పలువురు బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ కార్లని ధ్వంసం చేయడం పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే.. ప్రశాంత్ అభిమానులు చేసిన పనికి పాపం రైతు బిడ్డ రిమాండ్ కు వెళ్లాడు.. ఆ తర్వాత బయటకు వచ్చాడు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడనే సందేహం చాలామందికి వస్తుంది.. తాజాగా ప్రశాంత్ పాలిటిక్స్ లోకి రాబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి..

పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగానే యూట్యూబ్ వీడియోలు చేస్తూ బాగా ఫెమస్ అయ్యాడు.. వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేసేవాడు. తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకునేవాడు. తల్లికి సాయం చేస్తూ ఇల్లు వాకిలి ఊడుస్తున్న ఆ వీడియోలు కూడా యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసేవాడు.అయితే బిగ్ బాస్ తర్వాత పల్లవి ప్రశాంత్ కధ మారిపోయింది. బిగ్ బాస్ గా విన్నర్ అయిన ప్రశాంత్ ఇప్పుడు అతని కి వచ్చిన క్రేజ్ కారణంగా గొప్పగా ఉండాలని అనుకోలేదు.. ఎటువంటి గర్వం లేకుండా మామూలుగానే ఉన్నాడు..

ఇక సమయానికి తగ్గట్లు అతను గెటప్ లను మారుస్తూ ఉంటాడన్న విషయం తెలిసిందే.. తాజాగా తన బిగ్ బాస్ ఫ్రెండ్ ప్రిన్స్ యావర్ హీరోగా నటించిన ఓ ఈవెంట్ కు హాజరయ్యాడు.. ఈ సందర్బంగా మాట్లాడుతూ తన జీవితం గురించి ఆసక్తి కర విషయాలను చెప్పాడు.. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఆత్మవిశ్వాసంతో సరే గట్టిగా నిలబడాలి. నేను అలాగే నిలబడ్డాను. ఇప్పుడిలా మీ ముందు ఇలా తిరుగుతున్నాను. ఇంకా ఎన్ని ఎదురుదెబ్బలు తాకినా సరే నేను భయపడేది లేదు. అస్సలు వెనక్కు వెళ్లను. ఇలాగే గట్టిగా నిలబడతాను. రైతుబిడ్డ తల్చుకుంటే ఏదైనా సాధిస్తాడు’ అని చెప్పుకొచ్చాడు.. శివాజీ పార్లమెంట్ కు కూడా వెళ్తాడు అని అనడంతో.. ప్రశాంత్ మీ అభిమానం ఉంటే అదికూడా జరగచ్చు అన్నాడు.. దాంతో పల్లవి ప్రశాంత్ త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి.. ఇదే నిజమైతే మరో బర్రెలక్క అవుతాడని ఆయన అభిమానులు చెబుతున్నారు.. మరి పల్లవి ప్రశాంత్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది..