NTV Telugu Site icon

Pallavi Prasanth : హీరోగా పల్లవి ప్రశాంత్ ఎంట్రీ..డిటైల్స్ లీక్ చేసిన పాటబిడ్డ..

Pallavi Prasanth (2)

Pallavi Prasanth (2)

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు విన్నర్ గా కామన్ మ్యాన్ రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచారు.. ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చి బుల్లితెర మీద సంచలనాలు చేసిన రైతుబిడ్డ సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయనున్నాడనే న్యూస్ మరో కంటెస్టెంట్ లీక్ చేశాడు.. పట్టుదల, చెయ్యాలనే కోరిక ఉంటే ఏదైనా సాధించొచ్చు అనడానికి పల్లవి ప్రశాంత్ నిదర్శనం. ఒక మామూలు పల్లెటూరు యువకుడు. తన సొంత ఊరిలో కూడా అందరికి తెలిసి ఉండడు. ఏదో సాధించాలనే తపనతో వీడియో చేయడం స్టార్ట్ చేశాడు. విమర్శించినా, జనాలు నవ్వినా, వద్దని హెచ్చరించినా వినకుండా రీల్స్ చేసి ఫేమస్ అయ్యాడు.. అలా బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేశాడు..

అంచనాలు లేకుండా రైతుబిడ్డ బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టాడు. మొదటివారం పల్లవి ప్రశాంత్ పై జనాల్లో ఎలాంటి అంచనాలు లేవు. అతన్ని ఒక సాధారణ కంటెస్టెంట్ గానే చూశారు. అమర్ దీప్ టార్గెట్ చేశాక… పల్లవి ప్రశాంత్ పై సింపథీ పెరిగింది.. దాంతో ఓట్లు కూడా బాగానే పడ్డాయి.. తన గెలుపు కోసం చాలా మంది అండగా నిలబడ్డారు.. టైటిల్ రేసులో ఉన్న అమర్ నెగిటివ్ అయ్యాడు.. జనాల్లో తనపై ఉన్న సింపథీని అభిమానంగా మార్చుకున్నాడు పల్లవి ప్రశాంత్. మంచి ప్రవర్తనతో టాస్క్ లలో రాణిస్తూ… టైటిల్ రేసులోకి దూసుకొచ్చాడు. కామన్ మ్యాన్ గా అడుగుపెట్టి సెలెబ్రిటీ అయ్యాడు. అంచనాలు తారుమారు చేస్తూ టైటిల్ విన్నర్ గా నిలిచాడు..

ఆ ఆనందం తనకు ఎక్కువ సేపు నిలవలేదు.. అతని ఫ్యాన్స్ అత్యుత్సాహం జైలుపాలు అయ్యేలా చేసింది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పబ్లిక్, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం చేశారు. పల్లవి ప్రశాంత్ పోలీసుల మాట పెడచెవిన పెట్టి ర్యాలీ చేసి వాళ్ళ ఆగ్రహానికి గురయ్యాడు. అరెస్టై రిమాండ్ కి వెళ్లిన పల్లవి ప్రశాంత్, బెయిల్ పై ఈ మధ్యే విడుదలయ్యాడు.. తాజాగా భోలే షావలి ఇచ్చిన దావత్ లో కనిపించాడు.. పల్లవి ప్రశాంత్ హీరోగా భోలే మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమా చేయమని అడుగుతున్నారు. అయితే అది పల్లవి ప్రశాంత్ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది…ఈ సినిమా గురించి ఎక్కడా అధికారిక ప్రకటన అయితే రాలేదు.. మరి ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..

Show comments