Bigg Boss 9 : దివ్వెల మాధురి బిగ్ బాస్ హౌస్ లో నానా రచ్చ చేస్తోంది. ఎవరితో పడితే వారితో గొడవలు పడుతూ చూసే వాళ్లకు కూడా చిరాకు తెప్పిస్తోంది. ప్రతి చిన్న దానికి అందరిపై అరిచేస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. వచ్చీ రాగానే సింగర్ రాము రాథోడ్ పై విరుచుకుపడింది. అతనిపై ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకుంది. ఇక సంజనా గల్రానీని దొంగ అంటూ పెద్ద గొడవ పెట్టేసుకుంది. నేనింతో అన్నట్టు ఎటు పడితే అటే మాట్లాడేసింది. అటు ఫుడ్ విషయంలో దివ్య నికితపై అరిచేసింది. నా ఇష్టం ఉన్నంత కర్రీ వేసుకుంటా.. నువ్వెవరు నాకు చెప్పడానికి అన్నట్టు రెచ్చిపోయింది. మటకు మాట అన్నట్టు గట్టిగట్టిగా అరిచేస్తూ చాలా పెద్ద గొడవ పెట్టేసుకుంది.
Read Also : Brahmanandam : ఆయన వల్ల స్టేజిపైనే ఏడ్చేసిన బ్రహ్మానందం.. ఎందుకంటే..?
అక్కడితో ఆగిపోయిందా అంటే అదీ లేదు. రీతూ చౌదరితో లైట్ల విషయంలో పెద్ద రచ్చ చేసింది. మీద మీదకు వెళ్తూ గట్టిగట్టిగా అరిచేసింది. మరీ ఇంత వైల్డ్ గా ఉందేంటని చూస్తున్న ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. బిగ్ బాస్ అంటే టాస్కులు ఆడాలి. లాజిక్ తో అక్కడ మాట్లాడాలి. అంతే గానీ చూసే వాళ్లకు కూడా చిరాకు పుట్టించేలా ఈ అరవడం ఏంటి.. ఇలా గొడవలు పడటం ఏంటని ఆమె వీడియోల కింద వేలాది కామెంట్లు వస్తున్నాయి. ఇలా గొడవలు పడుతున్నాడనే కదా మాస్క్ మ్యాన్ హరీష్ ను బయటకు పంపించేశారు. ఇప్పుడు మాధురి కూడా ఇలా గొడవలు పెట్టుకుంటే ఎక్కువ కాలం హౌస్ లో ఉండటం కష్టమే అంటున్నారు బిగ్ బాస్ ప్రేమికులు.
Read Also : Jatadhara : మహేష్ బాబు చేతుల మీదుగా జటాధార ట్రైలర్ లాంచ్.. ఎప్పుడంటే..?
