NTV Telugu Site icon

Geetu Royal: విన్నర్‌ను ప్రకటించే వరకూ గీతూరాయల్ కనపడదా?

Geethu Royal

Geethu Royal

Geetu Royal: ఆదివారం బిగ్ బాస్ 6 నుంచి గీతూ రాయల్ ఎలిమినేట్ అయింది. అయితే ఎలిమినేషన్‌కు ముందు నాగార్జునతో స్టేజ్ మీద కనిపించిన గీతూ తనని బయటకు పంపించకండి అంటూ తెగ ఏడ్చేసింది. అంతేకాదు విన్నర్ లేదా టాప్ 3లో ఉండాలని కలలు కన్న గీతూ టాప్ 10లో లేకుండా పోవడం పై బాగా ఫీల్ అవుతోందట. దీంతో బిగ్ బాస్ అయ్యే వరకూ ఎవరికి కనపడనని నాగార్జునతో చెప్పిన గీతూ ఆ పై బిగ్ బాస్ కేఫ్ ఇంటర్వ్యూ తర్వాత ఎవరికీ కనపడకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. మరి నిజంగానే బిగ్ బాస్ పూర్తయ్యే వరకూ కనపడకుండా ఉంటుందా? లేక కొన్ని రోజుల తర్వాత స్థిమితపడి మీడియా ముందుకు వస్తుందా? అన్నది వేచి చూడాలి.

Read Also: TRP Rating: హిట్ అయిన ‘విక్రమ్’కి తక్కువ.. ప్లాఫ్ అయిన ‘బీస్ట్’కి ఎక్కువ!

మరోవైపు హౌస్‌లో గీతూ ఆడిన ఆట ఆడియన్స్‌కు నచ్చలేదు. ‘ఏమైనా అయితే నేనే పోతాలే’ అని చెప్పిన గీతూ ఆదివారం హౌస్ నుంచి వెళ్లిపోతూ ఏడుపులు, పెడబొబ్బలు పెట్టింది. ప్రతి గేమ్‌కి లూప్ వెతుక్కోవడం ఆమెకు ఒక పెద్ద మైనస్‌గా పరిణమించింది. ప్రతి ఒక్కరితోనూ మాట్లాడే తీరు కూడా ఇబ్బందికరంగా మారింది నామినేషన్స్‌లో అయితే గీతూ వ్యవహార శైలి పీక్స్‌కి వెళ్లిపోతుంది. అలాగే బాలాదిత్య విషయంలో ఆమె ప్రవర్తన జనానికి ఏమాత్రం నచ్చలేదు. అతడు ఒక స్థాయికి వెళ్లిపోయి బతిమాలినా కూడా వినిపించుకోలేదు. ఈ వ్యవహారం గీతూకు బాగా డ్యామేజ్ అయిపోయింది. అలాగే సంచాలక్‌గా ఉంటూ గేమ్ ఆడటం. ఎవరు చెప్పినా వినకపోవడం వంటివి బాగా మైనస్ అయ్యాయి. గీతూ విషయంలో అంతా స్వయంకృతాపరాధమే. భస్మాసురిడిలా గీతూ తన నెత్తిన తనే చేయి పెట్టుకున్నట్లు అందరూ చెప్పుకుంటున్నారు.