Site icon NTV Telugu

BigBoss-6: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. షానీ అవుట్..!!

Big Boss 6

Big Boss 6

BigBoss-6: తెలుగులో బిగ్‌బాస్-6 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. సెకండ్ వీకెండ్‌లో కంటెస్టెంట్లకు హోస్ట్ నాగార్జున బిగ్ షాకిచ్చారు. తొలివారం ఎలిమినేషన్ లేకుండా ముగియడంతో రెండో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని తాజాగా విడుదలైన ప్రోమోలో నాగార్జున చెప్పడం హౌస్‌లో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వారం మొత్తం 8 మంది ఎలిమినేషన్ ప్రక్రియలో ఉన్నారు. కెప్టెన్ రాజ్‌తో పాటు రేవంత్, గీతూ, ఆదిరెడ్డి, మెరీనా-రోహిత్ కపుల్, ఫైమా, షానీ, అభినయశ్రీ ఎలిమినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఓటింగ్ పరంగా రేవంత్ తొలిస్థానంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వారం వేదికగా నాగార్జున సీరియస్‌గా ఉన్నట్లు ప్రోమోలో కనిపించారు. అంతేకాకుండా ఆయన కంటెస్టెంట్లకు వార్నింగ్ ఇచ్చినట్లు కూడా కనిపిస్తోంది.

Read Also: Cows Theft: అక్కడ ఆవుల్నీ వదల్లేదు కేటుగాళ్లు

స్టార్ మా తాజాగా విడుదల చేసిన ప్రోమోలో నాగార్జున వెనుక 9 కుండలు ఉండగా.. కుండలపై ఉన్న 9 మంది బొమ్మల ఆధారంగా కంటెస్టెంట్లతో మాట్లాడుతూ వారి కుండలను పగులకొట్టారు. ఈ కుండలపై బాలాదిత్య, సుదీప, వాసంతి, శ్రీ సత్య, మెరీనా- రోహిత్, కీర్తి భట్, శ్రీహాన్, అభినయశ్రీ, షానీ ఫోటోలు ఉన్నట్లు కనిపిపస్తోంది. ఈ 9 మంది బిగ్ బాస్ హౌస్‌కు ఆడేందుకు రాలేదని, ఛిల్ అవ్వడానికి వచ్చారని నాగార్జున కామెంట్ చేశాడు. మరోవైపు శ్రీసత్యను ఉద్దేశించి బొమ్మను లాక్కున్నప్పుడు ఫీల్ కాలేదని.. అదే ప్లేటు లాక్కుంటే కచ్చితంగా ఫీలయ్యేదానివి అంటూ వ్యాఖ్యానించాడు. మెరీనా-రోహిత్ జంటను ఉద్దేశించి కూడా నాగ్ వ్యాఖ్యలు చేశాడు. మీరిద్దరూ ఈ ఇంట్లోకి పవర్ ఆఫ్ టూ కింద వచ్చారని.. కానీ ఆటలో మాత్రం మైనస్‌లో ఉన్నారని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోవైపు ఇప్పటికే ఆదివారం ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తయిందని.. షానీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నాగార్జున చెప్పినట్లు డబుల్ ఎలిమినేషన్‌లో భాగంగా షానీతో పాటు ఎలిమినేట్ అయిన మరో కంటెస్టెంట్ గురించి సమాచారం తెలియాల్సి ఉంది. ఓటింగ్ పరంగా చూస్తే కెప్టెన్ రాజశేఖర్, అభినయశ్రీ డేంజర్ జోన్‌లో ఉండటంతో వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యి ఉంటారని నెటిజన్‌లు చర్చించుకుంటున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే ఆదివారం ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Exit mobile version