బిగ్ బాస్ 5లో రన్నరప్ గా నిలిచాడు షణ్ముఖ్. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉన్న షణ్ముఖ్ బిగ్ బాస్ లో అడుగుపెట్టినపుడు తప్పకుండా విజేత అవుతాడనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. దానికి తోడు ఇటీవల కాలంలో వెబ్ సీరీస్ తో మరింత క్రేజ్ సంపాదించాడు. ఇన్ ష్టాలో అతని ఫాలోయర్స్ సంఖ్య 2.3 మిలియన్స్. ఇక ఇతగాడి లవర్ దీప్తి సునైన. వీరిద్దరు గత కొంత కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. వీరి లవ్ స్టోరీ తెలుగు రాష్ట్రాల్లోని సోషల్ మీడియాను ఫాలో అయ్యే అందరికీ తెలుసు. దీప్తికి సోషల్ మీడియాలో షణ్ముఖ్ ని మించి ఫాలోయర్స్ ఉన్నారు. దీప్తిన ఫాలో అయ్యే వారి సంఖ్య 3.2 మిలియన్స్. ఇక బిగ్ బాస్ 5లో ఫైనల్ కి చేరిన ఒకే ఒక లేడీ కాండిడేట్ సిరి. ఈ సీజన్ లో బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్, సరి మధ్య అనుబంధం ఏర్పడింది. సిరికి సైతం సోషల్ మీడియాలో భారీ సంఖ్యలోనే ఫాలోయర్స్ ఉన్నారు. బిగ్ బాస్ హౌస్ లో క్రమేపి సిరి, షణ్ముఖ్ ఒకరిపట్ల మరొకరు ఆకర్షితులయ్యారు. ఏకంగా కౌగిలింతలు, ముద్దులతో ప్రేక్షకులకు వినోదం పంచారు. అవి ఒక్కోసారి శ్రుతిమించి రాగాన పడి ట్రోల్స్ కి కూడా గురయ్యాయి. సిరి తల్లితో పాటు దీప్తి కూడా ఈ ముద్దులు, హగ్గుల పట్ల అసహనాన్ని వ్యక్తం చేశారు. తమ మధ్య సంబంధం కేవలం స్నేహబంధమేనని సిరి, షణ్ముఖ్ బుకాయించారు.
సిరి తన గెలుపుకంటే షణ్ముఖ్ గెలుపునే ఎక్కువగా కోరుకుంది. అయితే అనుకున్నామని జరగవు అన్నీ… అనుకోలేదని ఆగవు కొన్ని అని ఆత్రేయగారు చెప్పినట్లు ఇప్పుడు ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ కొత్త మలుపు తిరుగుతోంది. షణ్ముఖ్ గేమ్ ని పక్కన పెట్టి కౌగిలింతలకు ప్రాధాన్యం ఇవ్వటంతో టైటిల్ కూడా మిస్ అయ్యాడు. అంతే కాదు ఇప్పుడు ప్రేయసి ఆదరణ కూడా కోల్పోయినట్లు సమాచారం. దీప్తి షణ్ముఖ్, సిరి సంబంధంతో తీవ్రంగా హర్ట్ అయినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. దీప్తి ఇన్ స్టాలో పోస్ట్ లతో దీప్తి, షణ్నుల మధ్య ఆల్ ఈజ్ నాట్ వెల్ అని స్పష్టం అవుతోంది. వీరు బ్రేకప్ దిశగా ప్రయాణం చేస్తున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. బిగ్ బాస్ నుంచి రాగానే సిరి సొంత ఊరికి పయనమైంది. దీప్తి దూరమైతే సిరి, షణ్ను తమ బంధం స్నేహబంధంగానే పరిగణిస్తారా? లేక బిగ్ బాస్ హౌస్ లో దగ్గర అయినట్లే మళ్ళీ దగ్గర అవుతారా? అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ సినిమా స్టోరీ కంటే ఆసక్తి కరమైన ములుపులతో సాగుతోంది. ఎవరైనా నిర్మాతలు వీరి రియల్ స్టోరీనే సినిమాగా తీసి వారితోనే నటింప చేస్తే సూపర్ హిట్ అవటం ఖాయం. మరి ఆ దిశగా ఎవరు ప్రయత్నం చేస్తారో చూడాలి.