Site icon NTV Telugu

Bigg Boss 7 Telugu : అయ్యయ్యో.. అమర్ ఎంత పని చేశావ్.. పాపం..

Amar

Amar

బిగ్ బాస్ సీజన్ 7 ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతుంది.. నాలుగో వారం పవర్ అస్త్ర కోసం హౌస్ మేట్స్ యుద్ధమే చేస్తున్నారు.. కంటెస్టంట్స్ మధ్య పోటీని పెంచేందుకు విచిత్రమైన టాస్క్ లను ఇస్తున్నాడు.. ఈ ఆరుగురిలో ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. నామినేషన్స్ లో ఉన్నవారిలో టేస్టీ తేజా, రతిక, గౌతమ్ కృష్ణ, యావర్, శుభ శ్రీ, ప్రియాంక నామినేషన్స్ లో ఉన్నారు..

ఇప్పటివరకు జరిగిన విచిత్రమైన టాస్క్ లను చూస్తే.. స్మైల్ ప్లీజ్ అని, కన్నీళ్లతో గ్లాసులు నింపాలి అని ఏవేవో టాస్క్లు ఇచ్చాడు. పవర్ అస్త్ర సాధించడానికి ఇద్దరు కంటెండర్స్ ఫిక్స్ అయ్యారు. యావర్, ప్రశాంత్ ఫిక్స్ అవ్వగా ఇప్పుడు మరొకరికి ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. దాని కోసం గాలా అనే టాస్క్ ఇచ్చాడు. అయితే ఈ టాస్క్ లో హౌస్ లో ఉన్నవారు నవ్వు తెప్పించేలా చిత్రవిచిత్రంగా రెడీ అవ్వాలని అలాగే విభిన్నంగా రెడీ అవ్వాలని చెప్పాడు బిగ్ బాస్. ఎవరైతే నవ్వు తెప్పిస్తారో వారే నాలుగో పవర్ అస్త్ర దక్కించుకునే కంటెండర్ అవుతారని తెలిపాడు.. ఇక హౌస్ మేట్స్ కూడా రెచ్చిపోయారు.. ఎవరికి తగ్గట్లు వాళ్లు రెడీ అయ్యారు..

అందుకోసం అమర్ పెద్ద సాహసమే చేశాడు..సగం మీసం, సగం గడ్డం తీసేసి సగం అమ్మాయి, సగం అబ్బాయిలా మారాడు. అంతకు ముందు గుండు చేయించుకోవాలన్నప్పుడు మనోడు అంత సాహసం చేయలేక పోయాడు. కానీ ఈ సారి దేనికైనా రెడీ అని సగం మీసం, సగం గడ్డం తీసేశాడు. ఈ క్రమంలో శోభా శెట్టి , అమర్ మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది.. ఈరోజు ఎపిసోడ్ లో ఎవరు ప్రేక్షకులను బాగా నవ్విస్తారో వారే విన్నర్స్.. పవర్ అస్త్ర వారికే సొంతం అవుతుందని బిగ్ బాస్ చెప్పాడు.. మరి ఎవరు పవర్ అస్త్రను గెలుచుకుంటారో చూడాలి..

Exit mobile version