NTV Telugu Site icon

బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ కు ఏమైంది!?

What Happend to Bigg Boss Telugu Season 4 Winner Abhijeet

‘బిగ్ బాస్ 4’ విన్నర్ గా నిలిచి అందరినీ ఆకట్టుకున్నాడు అభిజిత్. శేఖర్ కమ్ముల తీసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రంతో నటుడగా మంచి పేరు తెచ్చుకున్న అభిజిత్ బిగ్ బాస్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే అభిజిత్ బిగ్ బాస్ టైటిల్ గెలిచాడని చెప్పనక్కరలేదు. బిగ్ బాస్ తర్వాత తనలో పోటీలో పాల్గొన ఇతరులు ఎవరికి వారు బిజీ అయిపోయారు. కొందరికి సినిమా ఫీల్డ్ లోనే అవకాశాలు లభించాయి. అయితే విన్నర్ గా నిలిచిన అభిజిత్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అంటూ ఓ సెషన్ నిర్వహించాడు అభిజిత్.

Read Also : “లైగర్” వయోలెన్స్ స్టార్ట్

అందులో ఫ్యాన్స్ నుంచి రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. వారిలో ఎక్కువగా తన కొత్త సినిమా సమాచారం గురించి అడిగారు. దానికి ‘ప్రస్తుతం తన ఆరోగ్యం బాగోలేదు. సినిమాలు చేయట్లేదని చెప్పాడు’ అభిజిత్. అంతే కాదు సినిమా అవకాశాల కంటే ఆరోగ్యం ముఖ్యమని స్పష్టం చేశాడు. అయితే తన ఆరోగ్య సమస్య ఏమిటి? అన్న దానికి సరైన సమాధానం ఇవ్వలేదు. అది ఏమిటన్నది అభిజిత్ నే రివీల్ చేయవలసి ఉంది. సో.. లెట్స్ వెయిట్.