“బిగ్ బాస్ 5” 5వ వారం ఇంటి సభ్యుడిని బయటకు పంపే సమయం ఆసన్నమైంది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో రవి, లోబో, ప్రియ, షణ్ముఖ్, సన్నీ, మానస్, జశ్వంత్, విశ్వ, హమీదా నామినేట్ అయ్యారు. ఈ తొమ్మిది మంది హౌజ్ మేట్స్ లో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉండడంతో ఈసారి ఎవరు బయటకు వెళ్తారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. హమీదా ఈ రేసులో వెనుకబడి ఉన్నట్టు సమాచారం. కానీ షణ్ముఖ్ భారీ సంఖ్యలో ఓట్లతో ఆధిక్యంలో ఉన్నాడని అంటున్నారు.
Read Also : “బిగ్ బాస్-5” విన్నర్ అతనే… నటరాజ్ మాస్టర్ జోస్యం
ఇప్పటికే ఆయన షో ప్రారంభమైనప్పటి నుంచి మూడుసార్లు నామినేట్ అయ్యాడు. కానీ ప్రతిసారి నామినేషన్లలో ఎలిమినేషన్ నుంచి బయటపడ్డాడు. ఓట్ల విషయానికి వస్తే షణ్ముఖ్, ఇతర పోటీదారుల మధ్య వ్యత్యాసం 30000 కి దగ్గరగా ఉందని సమాచారం. సోషల్ మీడియాలో షణ్ముఖ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.