NTV Telugu Site icon

బిగ్ బాస్ 5 : ప్రియాకు సింపతీ క్రియేట్ అవుతుందా?

Priya

Priya

“బిగ్ బాస్ -5” 4వ వారం ఎలిమినేషన్ ను సిద్ధం అవుతోంది. ఈ వారం హౌజ్ లో దాదాపు సగం మంది నామినేట్ అయ్యారు. నటరాజ్, లోబో, రవి, ప్రియా, కాజల్, సిరి, సన్ని, యానీ మాస్టర్ నామినేషన్ లో ఉన్నారు. అయితే ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్లలో ప్రియాకు సింపతీ క్రియేట్ అవుతున్నట్టు కన్పిస్తోంది. గత వారం ఆమె లహరి, రవిపై చేసిన కామెంట్లకు లహరి, రవి, హౌజ్ మేట్స్ తో పాటు బయట కూడా నెటిజన్లు ఫైర్ అయ్యారు. కానీ వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున అసలేం జరిగింది ? అనే విషయాన్ని క్లారిటీగా చూపించడంతో అందరూ షాక్ కు గురయ్యారు.

Read Also : గెలవాలంటే తగ్గాల్సిందే!

అయితే ఆ వీడియోలో రవి చేసిన కామెంట్స్ తప్పే. అందుకని ప్రియా అలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా కరెక్ట్ కాదన్నారు. అది అలా ఉంచితే… తాజా నామినేషన్లలో రవి సైతం ఆమెకు క్షమాపణలు చెప్పారు. ఇక లోబో తన లవ్ గురించి ఆమె అపహాస్యం చేసింది అంటూ ఫైర్ అవ్వడం, ఆ తరువాత ప్రియా ఏడుస్తున్నట్టు బిగ్ బాస్ చూపించడం.. ఇవన్నీ చూస్తుంటే ప్రేక్షకుల్లో ప్రియకు సింపతీ క్రియేట్ అవుతున్నట్టు కన్పిస్తోంది. నిజానికి ఆమెకు సింపతీ క్రియేట్ అవ్వడం అంటే మిగతా కంటెస్టెంట్లకు మైనస్ అవ్వడమే.