“బిగ్ బాస్ 5” బాగానే సాగుతుందని అనుకున్న ప్రేక్షకులకు మితి మీరుతున్న హౌజ్ మేట్స్ కామెంట్స్, ప్రవర్తన షాక్ ఇచ్చాయి. ఇదొక ఫ్యామిలీ షో అనే విషయాన్నీ మరిచి హద్దులు దాటి కామెంట్స్ చేస్తున్నారు. ఈ సోమవారం ఎలిమినేషన్ లో చోటు చేసుకున్న వివాదం దానికి నిదర్శనం. లహరి తనతో ఉండట్లేదన్న కోపంతో ప్రియా ఆమెపై విచక్షణ మరిచి కామెంట్స్ చేయడం దారుణం. లహరి, రవి వాష్ రూమ్ లో అర్ధరాత్రి హగ్ చేసుకున్నారు. లహరి కేవలం అబ్బాయిలతోనే మాట్లాడుతుంది అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఎంత దూరం వెళ్తాయో మరి. ప్రియా సీనియర్ ఆర్టిస్ట్. అయినప్పటికీ ఏమాత్రం ఆలోచించకుండా అలా అనేయడం, ఒక అమ్మాయి క్యారెక్టర్ ను ఇలా దిగజార్చడం ఎంత వరకు కరెక్ట్ అనేది నాగ్ వీకెండ్ లోనే చెప్పాలి.
Read also : బిగ్ బాస్ హౌస్ లో శ్రీరామ్ – లహరి పెళ్ళైపోయింది!
మరుసటి రోజు ప్రియ తన తప్పును గ్రహించి లహరి, రవికి క్షమాపణ చెప్పింది. ఆమె సారీని ఇద్దరూ యాక్సెప్ట్ చేసినప్పటికీ ప్రియా నేను చూసిందే చెప్పాను అంటూ మళ్ళీ మళ్ళీ మాట్లాడడం గమనార్హం. అయితే రవి దీనిపై థన్ కూతురు ఏమనుకుంటుందో అంటూ బాధ పడుతున్నాడు. ఇప్పటికే రవిపై పలు రూమర్స్ చక్కర్లు కొట్టాయి. మరి ఇది ఆయనపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. మరోవైపు లహరి తన తల్లిదండ్రులు తలెత్తుకునేలా చేస్తానని మాట ఇచ్చానని ఎమోషనల్ అవుతోంది. ఇక ప్రియా రవి స్వయంగా తనతో లహరి యాంకరింగ్ అవకాశాల కోసం క్లోజ్ గా మూవ్ అవుతోందని, ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదంటూ వాపోయాడని మరో వివాదానికి తెర తీసింది. ఆ తరువాత ముగ్గురూ కూర్చుని మాట్లాడుకున్నారు. రవి తాను అలా అనలేదని స్పష్టం చేశాడు. అయితే ప్రియా అబద్ధం చెప్పిందా ? రవి అబద్ధం చెప్పాడా ? తెలియాలంటే వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిందే.