షణ్ముఖ్ ను ఆటపట్టించిన నాగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షణ్ముఖ్ జస్వంత్ చూడటానికి కాస్తంత సిగ్గరిగా కనిపిస్తాడు. అతన్ని బిగ్ బాస్ హౌస్ లో చూసిన చాలా మంది గతంలో అతను చేసిన టిక్ టాక్స్, యూట్యూబ్ ఛానెల్ లో పలు వెబ్ సీరిస్ లో చేసిన యాక్టింగ్ చూసి… అతని నుండి ఎంతో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే… మొదటి రెండు రోజులు వారి ఎక్స్ పెక్టేషన్ కు తగ్గట్టుగా షణ్ముఖ్ బిహేవ్ చేయలేదు. చాలా లో-ప్రొఫైల్ ను మెయిన్ టైన్ చేశాడు. అయితే… ఆ తర్వాత రెండు మూడు రోజులు కాస్తంత లైమ్ లైట్ లోకి వచ్చాడు. బహుశా అందుకేనేమో శనివారం షణ్ముఖ్ ను నాగార్జున ఓ రేంజ్ లో ఆటపట్టించారు. అందరినీ వదిలేసి… పదే పదే షణ్ముఖ్ నే టార్గెట్ చేశారు. ‘అరే ఎంట్రా ఇది… కాస్త మాట్లాడు’ అంటూ ఒకసారి, ‘ఏంట్రా షణ్ముఖ్’ అని మరోసారి నవ్వుతూ చురకలంటించారు.
Read Also : సింగర్ శ్రీరామచంద్ర… రాముడా? కృష్ణుడా?
Also Read
ఇదే సమయంలో షణ్ముఖ్ లవ్ ఎఫైర్ గురించి ఇంటి సభ్యులూ ఆటపట్టించారు. తాను తెచ్చుకున్న పిల్లో ఉందో లేదో తరచూ చూసుకోవడం షణ్ముఖ్ కు అలవాటని వారు చెప్పగానే… పిల్లో మీద ఏం ఉంటుందని నాగ్ ఆరా తీశారు. అతని గర్ల్ ఫ్రెండ్ పేరు పొడి అక్షరాల్లో రాసి ఉంటుందని అనగానే… ఆమె పేరు చెప్పొచ్చుగా అని నాగ్ కోరారు. వెంటనే షణ్ముఖ్ కాస్తంత సిగ్గుపడుతూ, దీప్తి అని బదులిచ్చాడు. బిగ్ బాస్ 2 కంటెస్టెంట్ దీప్తి సునయన, షణ్ముఖ్ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అని అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల వీరు బ్రేకప్ చెప్పుకున్నారనే రూమర్స్ కూడా వచ్చాయి. కానీ అందులో వాస్తవం లేదని, తాను దీప్తితో ఇంకా ఆ రిలేషన్ షిప్ ను కొనసాగిస్తున్నానని షణ్ముఖ్ ఇన్ డైరెక్ట్ గా ప్రకటించేశాడు.
తాజావార్తలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
-
Gyanesh Kumar: CEC జ్ఞానేష్ కుమార్‌కు భారీ మద్దతు.. SIRను సమర్థిస్తూ 42 మంది మాజీ జడ్జీల లేఖ..
-
Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!