NTV Telugu Site icon

బిగ్ బాస్ 5 : హౌజ్ లోకి ఈ బ్యూటీల రీఎంట్రీ ?

Bigg-Boss-5

Bigg-Boss-5

“బిగ్ బాస్ 5” రానురానూ ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే 50 ఎపిసోడ్ లను కంప్లీట్ చేసుకున్న ఈ రియాలిటీ షోలో టాప్ 5కు ఎవరు వెళ్తారన్న టాక్ బాగా నడుస్తోంది. అయితే టాస్కులు, గొడవలతో ఎప్పటిలాగే రోజులు గడుస్తున్నాయి. కానీ హౌజ్ లో అమ్మాయిల సంఖ్య తగ్గడంతో గ్లామర్ కూడా బాగా తగ్గిపోయింది. ఏడూ వారాల్లో దాదాపు ఐదుగురు అమ్మాయిలే ఎలిమినేట్ కావడం దీనికి కారణం. ప్రస్తుతం హౌజ్ లో కాజల్, సిరి, అన్నే, ప్రియాంక నలుగురు మాత్రమే అమ్మాయిలు మిగిలారు. అయితే వీళ్లంతా గేమ్ పై మాత్రమే దృష్టి పెడుతున్నారు తప్ప పెద్దగా గ్లామర్ లేకుండా పోయింది.

Read Also : ముంబైలో “ఆర్ఆర్ఆర్” స్పెషల్ ఈవెంట్… గ్లింప్స్ రిలీజ్ ?

మసాలా తగ్గిపోయి చప్పగా మారిందని కొంతమంది బుల్లితెర ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో షోలో గ్లామర్ ను దట్టించడానికి హమీద, లహరిని తిరిగి హౌజ్ లోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే వాళ్ళు ఈ షోలో కేవలం హైప్‌ని సృష్టించడానికి, మరింత మసాలాలను జోడించడానికి మాత్రమే ఉంటారని అంటున్నారు. అంటే వాళ్ళకి విన్నర్ గా నిలిచే అవకాశం లేదన్నమాట.