NTV Telugu Site icon

బిగ్ బాస్ 5 : జెస్సి తల్లి ఎమోషనల్… డేంజర్ జోన్ లోంచి బయట పడతాడా ?

Jashwanth

Jashwanth

“బిగ్ బాస్ సీజన్ 5” విజయవంతంగా నడుస్తోంది. ఈ షో రాత్రి 10 గంటలకు ప్రసారమవుతున్నప్పటికీ మంచి స్పందనే వస్తోంది. గత ఎపిసోడ్ రాత్రి 9:30 గంటలకు ప్రసారమయ్యేది. అయితే ఈసారి కూడా పెద్దగా పరిచయం లేని ముఖాలనే హౌస్ లోకి పంపారు. ఇక వాళ్ళేమో గొడవలతోనే ఈ నాలుగైదు ఎపిసోడ్లను నెట్టుకొచ్చారు. మరోవైపు లవ్ స్టోరీలకు తెర తీయడానికి కొన్ని జంటలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వారం నామినేషన్లలో 6 మంది పోటీదారులు ఉన్నారు. వీరిలో ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు. నామినేషన్లలో ఉన్న వారిలో హమీదా, సరయు, జెస్సీ ముగ్గురూ చివరి 3 స్థానాల్లో ఉన్నారు. ఈ ముగ్గిరిలోనూ జెస్సి ఎలిమినేటి అయ్యే ఛాన్స్ ఉందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

Read Also : జెస్సీకి జైలు శిక్ష!

అంతేకాదు అతని ప్రవర్తన కూడా చిన్న పిల్లాడిలా ఉన్నదంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తాజాగా జెస్సీ తల్లి అతనికి మద్దతుగా నిలిచింది. ఈ మేరకు ఆమె ప్రేక్షకులకు ఒక భావోద్వేగ విజ్ఞప్తి చేసింది. జెస్సీ ప్రవర్తన బాగోలేదన్న నెటిజన్ల వ్యాఖ్యలపై జెస్సీ తల్లి స్పందించింది.

జెస్సీ ఎవరి మద్దతు లేకుండా మోడలింగ్ పరిశ్రమలో విజయవంతమయ్యాడని ఆమె వెల్లడించింది. ఆయన జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడని, జెస్సీ తండ్రికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అతని మెదడు దెబ్బ తినడంతో శరీర భాగాలు క్రమంగా పక్షవాతానికి గురయ్యాయని ఆమె వెల్లడించింది. ఈ సమస్యల కారణంగా జెస్సీ కెరీర్‌పై దృష్టి పెట్టలేకపోయడని, ఇప్పుడు బిగ్ బాస్‌లో అవకాశం రావడంతో అతను ట్రాక్‌లోకి వచ్చాడని జెస్సి తల్లి చెప్పింది. జెస్సీ కష్టపడి పని చేసేవాడు, బాధ్యతాయుతమైన వ్యక్తి కాబట్టి అతనికి మద్దతు ఇవ్వాలని ఆమె ప్రేక్షకులకు విజ్ఞప్తి చేసింది. మరి జెస్సి తల్లి ఎమోషనల్ రిక్వెస్ట్ ఎంత వరకు పని చేస్తుందో చూడాలి.