Site icon NTV Telugu

బిగ్ బాస్ 5 : ఈ వారం ఎమిలినేషన్… ఆ ఇద్దరిలో ఒకరు అవుట్ ?

Bigg Boss 5 Telugu : Another is going to eliminate

“బిగ్ బాస్ 5” షో గొడవలు, కామెంట్స్ తో వేడెక్కుతోంది. ఒకరిపై ఒకరు గట్టిగానే అరుచుకుంటున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్నవారు కూడా ఏమాత్రం తేడా వచ్చినా ఫైర్ అవుతున్నారు. కించపరిచేలా మాట్లాడితే ఏమాత్రం సహించడం లేదు ఇంటి సభ్యులు. అప్పుడే మూడో ఎలిమినేషన్ సమయం వచ్చింది. హౌస్‌మేట్స్ ప్రియా, ప్రియాంక, లహరి, మానస్, శ్రీరామ్ చంద్ర ఈ వారం నామినేషన్లలో ఉన్నారు.

Read Also : బిగ్ బాస్ 5 : ప్రియా మితి మీరిన కామెంట్స్ తో రవిపై ఎఫెక్ట్ ?

అయితే ఈ రేసులో మానస్ కు మంచి ఓటింగ్ ఉందట. హౌస్ లో అతని ప్రవర్తన, ఓపిక బుల్లితెర ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇటీవల ఆయన టాస్క్ ఆడిన తీరు, అలాగే వాళ్ళ టీమ్ మేట్స్ గెలవడానికి అతను చేసిన ప్రయత్నం, శ్రీరామ్ తో గొడవలో అతని మాట తీరు ఆకట్టుకున్నాయి. ఇక ఇందులో అతి తక్కువ ఓట్లతో లహరి వెనుకబడి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వీక్ నామినేషన్లలో ప్రియాకు, లహరికి జరిగిన గొడవ ప్రియాను కూడా డేంజర్ జోన్ లోకి నెట్టే అవకాశం ఉంది. ఆమె చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదనేది హౌజ్ మేట్స్ తో పాటు ప్రేక్షకుల అభిప్రాయం కూడా. ఆమెకు కూడా తక్కువ ఓటింగ్ నమోదు అవుతుండడం గమనార్హం. వీళ్లిద్దరి తరువాత ప్లేస్ లో అతి తక్కువ యాక్టింగ్ తో శ్రీరామ్ ఉన్నట్లు సమాచారం. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వీకెండ్ వరకు ఎదురు చూడాల్సిందే. ఇంకా వీకెండ్ కు రెండు రోజులు ఉండగా… లెక్కలు మారే అవకాశం లేకపోలేదు.

Exit mobile version