Site icon NTV Telugu

బిగ్ బాస్-5 : ఈ రోజు మరో లేడీ కంటెస్టెంట్ అవుట్

Bigg Boss 5 Telugu : Another is going to eliminate

“బిగ్ బాస్ 5” మూడవ వారం ఎలిమినేషన్ కు సమయం ఆసన్నమైంది. అయితే ఈ వారం కూడా లేడీ కంటెస్టెంట్ నే బయటకు పంపబోతున్నారు. మొదటి రెండు వారాల్లో సరయు, ఉమా దేవిని ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు మరో లేడీ కంటెస్టెంట్ బయటకు వెళ్లే సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. చూస్తుంటే యానీ మాస్టర్ చెప్పిన డైలాగ్ కు అంతా వ్యతిరేకంగా జరుగుతున్నట్టు కన్పిస్తోంది. ఆమె గతవారం నామినేషన్లలో అమ్మాయిలు అమ్మాయిల కన్నా స్ట్రాంగ్. వారితో టాస్కుల్లో మేమెలా పోటీ పడగలం. అందుకే బాయ్స్ అంతా బయటకు వెళ్లాలని నేను కోరుకుంటున్నాను అన్నారు. కానీ ఈవారంతో కలిపి మొత్తం ముగ్గురు లేడీ కంటెస్టెంట్లు బయటకు వెళ్ళిపోతారు.

Read Also : కంటెస్టెంట్స్ కు క్లాస్ పీకిన నాగ్!

మరోవైపు బిగ్ బాస్ లీక్స్ ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి. ఈవారం కూడా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ గురించి సమాచారం లీక్ అయ్యింది. మూడోవారంలో శ్రీరామ్, ప్రియ, మానస్, లహరి, ప్రియాంక నామినేట్ కాగా… శనివారం జరిగిన ఎపిసోడ్ లో నాగార్జున ఇద్దరిని సేవ్ చేశాడు. అందులో మొదటగా ప్రియాంక సేవ్ కాగా, తరువాత శ్రీరామ్ సేవ్ అయ్యాడు. ఇక మిగిలింది ప్రియా, మానస్, లహరి. ఈ ముగ్గురిలో లహరి బయటకు వెళ్లబోతోంది అనేది తాజా సమాచారం. ఈ రోజు జరిగే ఎపిసోడ్ లో లహరిని ఎలిమినేట్ చేయబోతున్నారు. ఈ లీక్స్ లో నిజం ఎంతో తెలియాలంటే రాత్రి వరకు ఎదురు చూడాల్సిందే.

Exit mobile version