బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు 14వ వారం ముగింపుకు చేరుకుంది.. ఈ క్రమంలో బిగ్ బాస్ డిఫరెంట్ టాస్క్ లతో ప్రేక్షకులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నాడు.. షో ముగింపుకు చేరుకోవడంతో ఎవరు విన్నర్ అవుతార అనే ఆసక్తి నెలకొంది.. హౌస్లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఎలిమినేట్ అయ్యే ఇద్దరు కంటెస్టెంట్స్ పేర్లు తెరపైకి వచ్చాయి.. ఈ విషయం పై గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది..
హౌస్ లో టాప్ కంటెస్టెంట్స్ మధ్య టైటిల్ పోరు రసవత్తరంగా ఉంది. 14 మంది సెలెబ్స్ తో షో మొదలు కాగా మరో 5 గురు కంటెస్టెంట్స్ ఐదు వారాల అనంతరం వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. మొత్తంగా 19 మంది కంటెస్టెంట్స్ ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేశారు.. వారిలో ప్రస్తుతం శివాజీ, ప్రశాంత్, అమర్, యావర్, అర్జున్, శోభ, ప్రియాంక ఉన్నారు. వీరిలో అర్జున్ ఫినాలే అస్త్ర గెలిచి టాప్ 5లో చోటు దక్కించుకున్నాడు.. మిగిలిన ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. చివరి రెండు వారాలకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయని బిగ్ బాస్ చెప్పారు. అంటే ఎలిమినేషన్ తో పాటు టైటిల్ కోసం ఓటింగ్ జరుగుతుంది. ఈ వారం ఓటింగ్ లో వెనకబడిన వారు హౌస్ నుంచి బయటకు వెళ్తారని వార్తలు వినిపిస్తున్నాయి..
అందుతున్న సమాచారం ప్రకారం.. పలు మీడియా సంస్థల అనధికార పోల్స్ ప్రకారం ప్రశాంత్ టాప్ లో ఉన్నాడు. ప్రియాంక, శోభ చివరి స్థానాల్లో ఉన్నారు. ఈ ఆదివారం శోభ ఎలిమినేషన్ ఖాయం అని తెలుస్తుంది.. హౌస్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న శోభను స్టార్ మా కాపాడుకుంటూ వస్తుందనే వాదన ఉంది. శోభను కాపాడేందుకు పలువురు టాప్ కంటెస్టెంట్స్ ని బలి చేశారని సోషల్ మీడియా టాక్.. అంటే ఈవారం ప్రియాంక సేఫ్ జోన్ లో ఉంటే యావర్ శోభా హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారని టాక్ వినిపిస్తుంది… ఇందులో నిజమేంత ఉందో తెలియాలంటే రేపటివరకు వెయిట్ చెయ్యాల్సిందే..