బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగింపు దశకు చేరుకుంది.. మరో వారంలో విన్నర్ ఎవరో తెలిసిపోతుంది.. ఇప్పటికే అంబటి అర్జున్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకున్నాడు.. ఆడియన్స్ కు మరింత ఆసక్తిని పెంచేందుకు బిగ్ బాస్ వింత టాస్క్ లను ఇస్తుంది.. ఇక విన్నర్ రేసులో శివాజీ ,ప్రశాంత్ , అమర్ ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా ఓ గేమ్ ఆడమని ఇస్తాడు.. ఈ గేమ్ కు శోభా శెట్టి, యావర్ సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. కోర్ట్ లోపల శివాజీ, ప్రియాంక, అర్జున్ గేమ్ ఆడుతున్నారు. శోభా శెట్టి ప్రియాంకని బాగా ఎంకరేజ్ చేస్తూ కనిపించింది.. ఫైనల్ డే కు రోజులు దగ్గర పడటంతో కంటెస్టెంట్స్ లో కసి కూడా పెరుగుతుంది..
ఇక ఇంటి సభ్యుల మధ్య వివాదాలు ఎక్కువవుతున్నాయి. గురువారం ఎపిసోడ్ లో ప్రశాంత్, అమర్ దీప్ మధ్య రచ్చ ఏ స్థాయికి వెళ్లిందో చూశాం. అమర్ దీప్ ఒక సందర్భంలో కంట్రోల్ తప్పి బూతులు కూడా మాట్లాడాడు..యావర్, శోభా శెట్టి మధ్య కూడా మాటల యుద్ధం సాగింది. బిగ్ బాస్ ఇచ్చిన ఓట్ అప్పీల్ గేమ్ లో భాగంగా ఈ గొడవలు జరుగుతున్నాయి. నేడు కూడా బిగ్ బాస్ హౌస్ హాట్ హాట్ గా ఉండబోతోంది. బంతులు విసిరే గేమ్ నేడు శుక్రవారం ఎపిసోడ్ లో కూడా కొనసాగనుంది.. ఈరోజు ఎపిసోడ్ ప్రోమోను చూస్తే.. శివాజీ, శోభా శెట్టి మధ్య రచ్చ తారా స్థాయికి చేరినట్లు అనిపిస్తోంది. ఈ గేమ్ కి శోభా శెట్టి, యావర్ సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. కోర్ట్ లోపల శివాజీ, ప్రియాంక, అర్జున్ గేమ్ ఆడుతున్నారు..
అప్పుడు ప్రియాంకను శోభా ఎంకరేజ్ చేస్తుంది.. సంచాలక్ గా ఉండి ఒకరికే సపోర్ట్ చేస్తావా అని శివాజీ ప్రశ్నించారు. నేను సంచాలక్ గా అయినా, శోభా శెట్టిగా అయినా నా ఇష్టం వచ్చిన వారికి సపోర్ట్ చేస్తా అని సమాధానం ఇచ్చింది. అందుకే నాకు నచ్చలేదు.. గేమ్ నుంచి బయటకి వచ్చేశా అని శివాజీ తెలిపాడు.. దానికి శోభా మరింతగా ఓవర్ చేసింది.. సర్ కూర్చోండి, బాగా అలసిపోయారు అంటూ శోభా రెచ్చగొట్టింది. దీనితో శివాజీ ఆడపిల్లవి ఇలా అడ్వాంటేజ్ తీసుకోవద్దు అని వార్నింగ్ ఇచ్చాడు. మీలాగా అయితే నేను నటించలేను వామ్మో 80 కెమెరాల్లో మీరు నటిస్తారు అంటూ శోభా అంది.. మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..