NTV Telugu Site icon

Bigg Boss Telugu 7: శుభ శ్రీ ని టార్గెట్ చేసిన రతికా..మరో యాంగిల్ ను చూపిస్తున్న యావర్..

Yavar

Yavar

బిగ్ బాస్ సీజన్ 7 మూడో వారం ఎలిమినేషన్ ను పూర్తి చేసుకుంది.. నిన్న హౌస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్ అయ్యింది.. ఇక నాలుగో వారం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలైంది.. నామినేషన్స్ కు సంబందించిన ఎపిసోడ్ ప్రోమోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఇందులో ముఖ్యంగా శుభ శ్రీ, రతిక మధ్య వాదనలు పీక్‌కి వెళ్లాయి. అలాగే యావర్‌, గౌతం కృష్ణల మధ్య వాదనలు ఏకంగా కొట్టుకునే స్థాయికి వెళ్లాయి. మరోవైపు యావర్‌ని తేజ ఓ రేంజ్‌లో ఆడుకున్నాడు. నేను ఇలానే ఉంటానంటూ ఫైర్ అయ్యారు. ఇక ప్రోమోల్లో నిన్న జరిగిన ఎపిసోడ్‌కి సంబంధించి రతిక, శివాజీల మధ్య వాదన జరిగింది..

రతికా మళ్లీ అదే అనడంతో శివాజీ కాళ్లు పట్టుకోమంటావా.. లేదా ఇంకేదైనా ఉందా అంటూ అరుస్తాడు.. అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో ప్రతి ఒక్కరు ఇద్దరిని నామినేట్‌ చేయాలి, దాన్ని ఇతర ఇద్దరు అంగీకరించాలి. పవర్‌ అస్ర్త సాధించిన వాళ్లు నామినేషన్లకి మినహాయింపు. దీంతో శివాజీ, సందీప్‌, శోభా శెట్టి జడ్జ్ లు గా వ్యవహరించారు.. ఇక ఒకరికొకరు నామినేట్ చేసుకున్నారు. అనంతరం టాస్క్ లలో మునిగి పోయారు.. ఇక శుభ శ్రీ నామినేట్‌ చేసిన వారిలో అమర్‌ దీప్‌ కూడా ఉన్నాడు. ఇంట్లో నేనేమీ పనులు చేయలేదా.. అంటూ ప్రశ్నించాడు. నువ్వు మాత్రం కేవలం చపాతిలు మాత్రమే చేస్తావని, శుభ శ్రీ రోటీస్‌ అని బోర్డ్ పెట్టుకో అంటూ సెటైర్లు పేల్చాడు అమర్‌ దీప్‌. ఈ సందర్బంగా ఓ విషయాన్ని ఆయన వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. ప్రేక్షకుల్లో ఎపిసోడ్ ప్రోమో ఆసక్తిగా మారింది..

ఆ తర్వాత యావర్, గౌతమ్ ల మధ్య గొడవ జరుగుతుంది.. ఒకరికరు తిట్టుకుంటున్నారు.. హౌస్ లో ఎప్పుడూ చూడని విధంగా యావర్ సీరియస్ అవ్వడం ఎపిసోడ్ కు హైలెట్ అయ్యింది..యావర్‌ .. ప్రియాంక, తేజలను నామినేట్‌ చేశాడు. ఈ క్రమంలో శోభా, ప్రియాంక ఫెమినిజం ప్లే చేస్తూ గేమ్‌ ఆడుతున్నారంటూ నోరు జారాడు. దీంతో జడ్జ్ గా ఉన్న శోభా శెట్టి ఫైర్‌ అయ్యింది. ఆ విషయం తేలే వరకు తాను ఆర్గ్యూకి ఒప్పుకోనని తెలిపింది. అయితే తనని పవర్‌ అస్త్ర పోటీ నుంచి తొలగించడం విషయంలో యావర్‌ హర్ట్ అయినట్టు తెలిపారు. అనంతరం తేజ, యావర్ మధ్య రచ్చ జరిగింది… మొత్తానికి ఈ నాలుగో వారం ఎలిమినేషన్ ప్రక్రియ చాలా హాట్‌ హాట్‌గా జరిగిందని ప్రోమోలను బట్టి తెలుస్తుంది.. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి..