NTV Telugu Site icon

Bigg Boss Telugu 7: కెప్టెన్సీ కోసం మరో చిచ్చుపెట్టిన బిగ్‌ బాస్‌.. బెస్ట్ పెర్ఫార్మన్స్ ఎవరిదంటే?

Bigg Boss77 (2)

Bigg Boss77 (2)

తెలుగు టాప్ రియాలిటీ షో బిగ్‌ బాస్‌ తెలుగు 7వ సీజన్‌ నాలుగు వారాలు పూర్తయ్యాయి. దీంతో ఐదో వారంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చారు బిగ్‌ బాస్‌.. ముందుగా చెప్పినట్లు ఉల్టా పుల్టా అనే విధంగా ఎన్నో మార్పులు తీసుకొచ్చారు.. ఊహకు అందని విధంగా కొత్త అనేక ట్విస్ట్ లు ఇస్తున్నారు.. నిన్నటి ఎపిసోడ్ లో పవర్ అస్త్రాలను వెనక్కి తీసుకున్నారు.. శివాజీ హ్యాపీగా ఫీల్ అవ్వగా.. శోభా అతనిపై మండిపడింది..

ఇకపోతే నిన్నటి ఎపిసోడ్‌లో హౌజ్‌లో ఉన్న పది మంది కంటెస్టెంట్‌లు జంటలుగా ఏర్పడాలని తెలిపారు బిగ్‌ బాస్‌. ఈ నెల రోజుల్లో హౌజ్‌లో ఒకరితో ఒకరికి బాండింగ్‌ ఏర్పడి ఉంటుందని, అలా తమ బెస్ట్ బడ్డీలను ఎంపిక చేసుకోవాలని, అందరు జంటలుగా ఏర్పడాలని తెలిపారు బిగ్‌బాస్‌. వాళ్లు బడ్డీలుగా ఏర్పడిన దాన్ని బట్టి మున్ముందు ఆట ఉంటుందని, అందుకే జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలన్నారు.. దాంతో హౌస్ లోని వాళ్లు జంటలు ఏర్పడ్డారు..శివాజీ-ప్రశాంత్‌, అమర్‌-సందీప్‌, ప్రియాంక-శోభా శెట్టి, గౌతమ్‌-శుభ శ్రీ, యావర్‌-తేజ లు జంటలగా ఏర్పడ్డారు..

ఈ క్రమంలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు స్మైల్‌` టాస్క్ ఇచ్చారు.. ఆ స్మైల్‌లో పళ్లు మిస్సింగ్‌ ఉంటాయి. వాటిని వెతికి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ టాస్క్ ను మొదటగా శివాజీ, ప్రశాంత్‌ పళ్లు ఫిల్‌ చేసి బెల్ కొడతారు. ఆ తర్వాత గౌతమ్‌-శుభ శ్రీ, ఆ తర్వాత సందీప్‌-అమర్‌లు బెల్‌ కొడతారు. శోభా శెట్టి, ప్రియాంకలు, చివరగా యావర్‌ తేజలు నిలుస్తారు.. అయితే ఈ టాస్క్ ను ఎవరు పూర్తిగా చెయ్యలేక పోతారు..గౌతమ్‌-శుభశ్రీ, సందీప్‌- అమర్‌, శివాజీ-ప్రశాంత్‌, శోభాశెట్టి-ప్రియాంక, చివరగా యావర్‌-తేజలుగా నిర్ణయించారు. కానీ దీనిపై అటు అమర్‌, ఇటు ప్రియాంక అభ్యంతరం తెలిపారు.. దాంతో హౌస్ లో హీటెక్కుతుంది.. మరి కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు నిలిచారో ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది..