Bigg Boss 9 : బిగ్ బాస్ ను ఎందుకు చూస్తారంటే చాలా కామన్ గా వినిపించే ఆన్సర్ అందులో నడిచే లవ్ ట్రాక్ లు. అవి బిగ్ బాస్ లో జరిగే మిగతా అన్నింటికంటే బాగా హైలెట్ అవుతాయి. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పటికే చాలా సీజన్లలో ఇది కంటిన్యూ అయింది. ఇప్పుడు సీజన్-9లో అప్పుడే ఓ లవ్ ట్రాక్ స్టార్ట్ అయినట్టు కనిపిస్తోంది. అదేదో కాదు.. రీతూ చౌదరి, జవాన్ పవన్ కల్యాణ్ మధ్య. మొన్న రీతూ చౌదరి కావాలనే పవన్ కల్యాణ్ ను కళ్లలో కళ్లు పెట్టి చూసుకునే గేమ్ ఆడుదాం అంటూ అడిగింది. ఇద్దరూ కాసేపు అలా కళ్లలో కళ్లు పెట్టి చూసుకున్నారు. రీతూ మనోడికి ఓర సైగలు చేస్తూ నవ్వులు విసిరింది. చూస్తుంటే అమ్మడు మనోడి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించినట్టు కనిపించింది.
Read Also : Varun Tej & Lavanya : మెగా కుటుంబంలో కొత్త అతిథి.. వరుణ్ తేజ్-లావణ్యకు బేబీ బాయ్
ఆ తర్వాత కూడా రెండు సార్లు మనోడితో సీక్రెట్ గా మాట్లాడేందుకు ట్రై చేసింది. ఇద్దరూ యంగ్.. పైగా పెయిర్ బాగుంది కదా. అందుకే ఈ ట్రాక్ తెరమీదకు వచ్చేసింది. పైగా పవన్ మొదట్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించనట్టే కనిపించాడు. కానీ క్రేజ్ కోసమో దేనికోసమో తెలియదు.. ఇప్పుడు మెల్లిమెల్లిగా ఆమె లైన్ లోకి వచ్చేస్తున్నాడు. మొదలై వారం కాక ముందే ఇలా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ క్రియేట్ అయిపోయిందన్నమాట. అసలే రీతూ చౌదరికి మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు పవన్ తో లవ్ ట్రాక్ వల్ల పాజిటివ్ ఇంప్రెషన్ కొట్టేయాలని చూస్తున్నట్టుంది. మరి ఈ లవ్ ట్రాక్ ఎంత వరకు కొనసాగుతుందో చూడాలి.
Read Also : YS Jagan on Super Six: అట్టర్ ఫ్లాప్ సినిమాకు బలవంతపు విజయోత్సవాలు..
