Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Bigg Boss Telugu Bigg Boss 9 Agnipariksha Controversy

Bigg Boss 9 : య్యోవ్ బిగ్ బాసూ… నీ అగ్నిపరీక్ష అవసరమా ?

Published Date :August 28, 2025 , 6:00 pm
By Bhargav Chaganti
  • బిగ్ బాస్ 9 తెలుగు "అగ్నిపరీక్ష"పై విమర్శల వెల్లువ
  • టార్చర్ టాస్క్‌లపై నెటిజన్ల ఆగ్రహం
  • హౌస్ లోకి వెళ్లే 5 మంది కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు "అగ్నిపరీక్ష"
Bigg Boss 9 : య్యోవ్ బిగ్ బాసూ… నీ అగ్నిపరీక్ష అవసరమా ?
  • Follow Us :
  • google news
  • dailyhunt

బిగ్ బాస్ 9 తెలుగు కౌంట్‌డౌన్ మొదలైంది. సెప్టెంబర్ 7వ తేదీన షో మొదలు కానుంది. కానీ ప్రధాన షో కంటే ముందే, జియో+ హాట్‌స్టార్ “అగ్నిపరీక్ష”తో ప్రేక్షకులకు ఒక టీజర్‌ను అందించింది. ఈ పేరులోనే కథ మొత్తం దాగి ఉంది. “అగ్నిపరీక్ష” అంటేనే అగ్నిలో నుంచి నడిచి బయటకు వచ్చినట్టు, అందుకే ఇది కేవలం సాధారణ టాలెంట్ షో కాదని ఒక్క ఎపిసోడ్ చూసిన ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షోకి, నవదీప్, అభిజిత్, బిందు మాధవి “న్యాయమూర్తులు”గా వ్యవహరిస్తున్నారు. 15 మంది కంటెస్టెంట్లలో కేవలం ఐదుగురిని మాత్రమే బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించడమే ఈ షో లక్ష్యం. అందుకు 45 మందిని సెలెక్ట్ చేసి చివరికి 15 మందిని తేల్చారు. వారిలో నుంచి 10 మందిని బయటకు 5 గురిని లోపలకి పంపే అవకాశం ఉంది.

Also Read : Lakshmi Menon: యువకుడి కిడ్నాప్ కేసు.. హీరోయిన్ లక్ష్మీ మీనన్‌కు హైకోర్టులో ఊరట!

అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ షోలో టాస్క్‌లు వింతగా, అమానుషంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవేమీ సాధారణ రియాలిటీ షో టాస్క్‌లు కాదని, ఓ రకంగా చెప్పాలంటే టార్చర్ కి కేరాఫ్ అడ్రస్ లాగా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. మగవారి ఛాతికి వ్యాక్సింగ్ చేయడం, వైబ్రేటర్లతో షాక్‌లు ఇవ్వడం లాంటి టాస్క్‌లను చూస్తుంటే, బిగ్ బాస్ నిర్వాహకులు ” బిగ్ బాస్ లోకి పంపడానికి కాదు టార్చర్ చేసి బయటకు పంపడానికి ఈ టాస్క్ లు పెడుతున్నారని అనిపిస్తోంది.

ఇటీవల ఒక కంటెస్టెంట్ తన ఐఫోన్‌ను టాస్క్‌లో పగలగొట్టడం వైరల్ అయ్యింది. నిజానికి యువతకు ఫోన్ కేవలం ఆస్తి నష్టం మాత్రమే కాదు, ఒక రకమైన భౌతిక దాడి. ఫోన్ లేకుంటే శరీరంలోని ఒక భాగమే మిస్ అవుతున్నట్లు భావించే యువత ఇలాంటి టాస్కుల వల్ల ఎలాంటి పరిణామాలకు లోనవుతారో చెప్పలేని పరిస్థితి. దానికి తోడు ఆర్మీ జవాన్ ఒకరిని ఈ అగ్నిపరీక్ష కోసం తీసుకొచ్చి అతని చేత కామెడీ చేయిస్తూ ఆర్మీ పరువు మంటగలుపుతున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు. ఈ టాస్క్‌లపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : Bigg Boss 9: లాంచ్ డేట్ ఫిక్స్.. ఈ సారి డబుల్ హౌస్, డబుల్ డోస్

ఈ పోకడ ఇలాగే కొనసాగితే, కంటెస్టెంట్లను వారి ఎముకలు విరగ్గొట్టుకోవాలని కూడా అడుగుతారేమో అని కొందరు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఇక హౌస్‌లోకి ఫ్లోరా సైనీ, సంజనా గల్రానీ వంటి సెలబ్రిటీలు కూడా వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అసలు వాళ్ల హౌస్ లోపలికి వెళ్లి ప్రేక్షకులకు వినోదం అందిస్తారో లేదో పరీక్షిస్తున్నారా లేక ఏదైనా రక్షణ విభాగాల కోసం పరీక్షలు నిర్వహిస్తున్నారా అనేది అర్థం కావడం లేదు. బిగ్ బాస్ హౌస్‌లో బిగ్ బాస్ 9 “రియాలిటీషో” కాకుండా “రియాలిటీ ఫైటర్స్ క్యాంప్”గా మారే అవకాశం ఉంది. అన్నట్టు కామనర్స్ పేరుతో గతంలో బిగ్ బాస్ మీద విమర్శలు కూడా చేసిన ఇంస్టా చుక్కలను కూడా తెచ్చి ఈ అగ్ని పరీక్షలో పడేశారు. జియో హాట్ స్టార్ సంస్థతో పాటు స్టార్ మా కూడా ఈ విషయంలో మరోసారి ఆలోచిస్తే మంచిది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags

తాజావార్తలు

  • Virat Kohli: లండన్‌కి మకాం మార్చిన కోహ్లీ?.. విదేశీ ప్లేయర్ అంటూ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విరాట్!

  • Iran-Israel: ఇరాన్, లెబనాన్‌పై ఏకకాలంలో ఇజ్రాయెల్ దాడులు.. మంటల్లో పలు భవనాలు

  • Annamalai: ఆ ప్రచారమంతా అబద్ధం.. బీజేపీ జాబితాలో పేరు లేకపోవడంపై అన్నామలై క్లారిటీ

  • తప్పు చేస్తే అగ్రరాజ్యమైనా సరే.. అమెరికాకు భారత HAL మాస్ వార్నింగ్!

  • Stephen Fleming: రెండు మ్యాచుల్లో 6,7 రన్స్‌కే కుప్పకూలిన సంజూ శామ్సన్.. ఫామ్‌పై సీఎస్‌కే కోచ్ సంచలన వ్యాఖ్యలు!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions