బిగ్ బాస్ 9 తెలుగు కౌంట్‌డౌన్ మొదలైంది. సెప్టెంబర్ 7వ తేదీన షో మొదలు కానుంది. కానీ ప్రధాన షో కంటే ముందే, జియో+ హాట్‌స్టార్ “అగ్నిపరీక్ష”తో ప్రేక్షకులకు ఒక టీజర్‌ను అందించింది. ఈ పేరులోనే కథ మొత్తం దాగి ఉంది. “అగ్నిపరీక్ష” అంటేనే అగ్నిలో నుంచి నడిచి బయటకు వచ్చినట్టు, అందుకే ఇది కేవలం సాధారణ టాలెంట్ షో కాదని ఒక్క ఎపిసోడ్ చూసిన ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ షోకి, నవదీప్, అభిజిత్, బిందు మాధవి “న్యాయమూర్తులు”గా వ్యవహరిస్తున్నారు. 15 మంది కంటెస్టెంట్లలో కేవలం ఐదుగురిని మాత్రమే బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించడమే ఈ షో లక్ష్యం. అందుకు 45 మందిని సెలెక్ట్ చేసి చివరికి 15 మందిని తేల్చారు. వారిలో నుంచి 10 మందిని బయటకు 5 గురిని లోపలకి పంపే అవకాశం ఉంది.
Also Read : Lakshmi Menon: యువకుడి కిడ్నాప్ కేసు.. హీరోయిన్ లక్ష్మీ మీనన్‌కు హైకోర్టులో ఊరట!
అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ షోలో టాస్క్‌లు వింతగా, అమానుషంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అవేమీ సాధారణ రియాలిటీ షో టాస్క్‌లు కాదని, ఓ రకంగా చెప్పాలంటే టార్చర్ కి కేరాఫ్ అడ్రస్ లాగా ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. మగవారి ఛాతికి వ్యాక్సింగ్ చేయడం, వైబ్రేటర్లతో షాక్‌లు ఇవ్వడం లాంటి టాస్క్‌లను చూస్తుంటే, బిగ్ బాస్ నిర్వాహకులు ” బిగ్ బాస్ లోకి పంపడానికి కాదు టార్చర్ చేసి బయటకు పంపడానికి ఈ టాస్క్ లు పెడుతున్నారని అనిపిస్తోంది.
ఇటీవల ఒక కంటెస్టెంట్ తన ఐఫోన్‌ను టాస్క్‌లో పగలగొట్టడం వైరల్ అయ్యింది. నిజానికి యువతకు ఫోన్ కేవలం ఆస్తి నష్టం మాత్రమే కాదు, ఒక రకమైన భౌతిక దాడి. ఫోన్ లేకుంటే శరీరంలోని ఒక భాగమే మిస్ అవుతున్నట్లు భావించే యువత ఇలాంటి టాస్కుల వల్ల ఎలాంటి పరిణామాలకు లోనవుతారో చెప్పలేని పరిస్థితి. దానికి తోడు ఆర్మీ జవాన్ ఒకరిని ఈ అగ్నిపరీక్ష కోసం తీసుకొచ్చి అతని చేత కామెడీ చేయిస్తూ ఆర్మీ పరువు మంటగలుపుతున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు. ఈ టాస్క్‌లపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : Bigg Boss 9: లాంచ్ డేట్ ఫిక్స్.. ఈ సారి డబుల్ హౌస్, డబుల్ డోస్
ఈ పోకడ ఇలాగే కొనసాగితే, కంటెస్టెంట్లను వారి ఎముకలు విరగ్గొట్టుకోవాలని కూడా అడుగుతారేమో అని కొందరు వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఇక హౌస్‌లోకి ఫ్లోరా సైనీ, సంజనా గల్రానీ వంటి సెలబ్రిటీలు కూడా వస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అసలు వాళ్ల హౌస్ లోపలికి వెళ్లి ప్రేక్షకులకు వినోదం అందిస్తారో లేదో పరీక్షిస్తున్నారా లేక ఏదైనా రక్షణ విభాగాల కోసం పరీక్షలు నిర్వహిస్తున్నారా అనేది అర్థం కావడం లేదు. బిగ్ బాస్ హౌస్‌లో బిగ్ బాస్ 9 “రియాలిటీషో” కాకుండా “రియాలిటీ ఫైటర్స్ క్యాంప్”గా మారే అవకాశం ఉంది. అన్నట్టు కామనర్స్ పేరుతో గతంలో బిగ్ బాస్ మీద విమర్శలు కూడా చేసిన ఇంస్టా చుక్కలను కూడా తెచ్చి ఈ అగ్ని పరీక్షలో పడేశారు. జియో హాట్ స్టార్ సంస్థతో పాటు స్టార్ మా కూడా ఈ విషయంలో మరోసారి ఆలోచిస్తే మంచిది.
