Site icon NTV Telugu

Bigg Boss7 Telugu : బిగ్ బాస్ లోకి వంటలక్క ఎంట్రీ.. ఒక్క పోస్ట్ తో క్లారిటీ..

Vantalakka

Vantalakka

బిగ్ బాస్.. తెలుగు టెలివిజన్ చరిత్రనే మార్చివేసింది.. ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న షో ఇదే.. ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ సీజన్ ప్రస్తుతం ఏడో సీజన్ ను జరుపుకుంటుంది.. ప్రస్తుతం ఆరోవారం నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి.. ఈ షో కాన్సెప్ట్ పెద్దగా అర్థం కాకపోయిన ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను అందుకుంది..ఎవరూ ఊహించని రీతిలో విజయాన్ని అందుకున్న ఇది.. దేశంలోనే టాప్‌ షోగా నిలిచింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు ఏడో దాన్ని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుపుతున్నారు. ఇక, ఇందులోకి మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా రాబోతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.. తాజాగా ఈ విషయం పై క్లారిటి ఇచ్చేసారు..

బిగ్ బాస్ ఏడో సీజన్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో తీసుకు వస్తున్నట్లు చెప్పడంతో అవన్నీ రెట్టింపు అయ్యాడు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని సరికొత్త కంటెంట్‌తో నడుపుతున్నారు.. ఇక అదే విధంగా గత సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ ట్విస్ట్ లు మాములుగా లేవు.. టాస్క్ లు అయితే చెప్పనక్కర్లేదు.. సర్‌ప్రైజ్‌లను హైలైట్ చేస్తున్నారు.ఏడో సీజన్‌లోకి మొదట 14 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఐదు వారాల తర్వాత మరో ఐదుగురు కూడా హౌస్‌లోకి అడుగు పెట్టారు.

ఇలా మొత్తం మీద 19 మంది కంటెస్టెంట్లు ఇందులోకి వచ్చారు. ఆరు వారాలు పూర్తి అయ్యింది.. షోలో ఇంకొక స్పెషల్ ఎంట్రీ కూడా ఉండబోతుందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇది కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీనే అని అంటున్నారు. ఇందుకోసం భారీ ఫాలోయింగ్ ఉన్న సెలెబ్రిటీని తీసుకు రావాలని బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అది కూడా కార్తీక దీపం ఫెమ్ వంటలక్క ను తీసుకొచ్చే ప్లాన్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ వార్తల పై తాజాగా ప్రేమి విశ్వనాథ్ స్పందించింది..ఈ మేరకు ఓ వెబ్‌సైట్ రాసిన ఈ కథనానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘ఇది ఫేక్ న్యూస్’ అని తేల్చేసింది. ఫలితంగా బిగ్ బాస్ షోలోకి తాను రావడం లేదని క్లారిటీ ఇచ్చేసింది. మొత్తానికి ఈ వార్తలకు చెక్ పడింది…

Exit mobile version