బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు షో ప్రస్తుతం ఎనిమిదో వారం జరుపుకుంటుంది.. ప్రశాంత్-గౌతమ్, శోభా-భోళే-ప్రియాంక మధ్య ఫైట్ వాడివేడీగా జరిగింది. ఎవ్వరూ తగ్గట్లేదు.. దాంతో ఈ వారం నామినేషన్స్ రసవత్తరంగా సాగుతున్నాయి.. 8వ వారం నామినేషన్లలో మొత్తంగా 8 మంది నామినేట్ అయ్యారు. వారిలో శివాజీ, అమర్ దీప్, ఆట సందీప్, భోలే షావలి, గౌతమ్ కృష్ణ, అశ్విని శ్రీ, శోభా శెట్టి, ప్రియాంక జైన్ ఉన్నారు.. ఓటింగ్ తారుమారు అయ్యాయి.. తాజా ఓటింగ్ ప్రకారం అత్యధిక ఓట్లతో టాప్‌లో హీరో శివాజీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి రెండో స్థానంలో సీరియల్ అమర్ దీప్ చౌదరి కొనసాగాడు. ఇక అనూహ్యంగా సింగర్ భోలే మూడో స్థానంలో ఉండటం విశేషం. అలాగే నాలుగో స్థానంలో గౌతమ్ కృష్ణ, ఐదో స్థానంలో ప్రియాంక జైన్, ఆరో స్థానంలో సందీప్, ఏడో స్థానంలో అశ్విని ఉన్నారు..
లాస్ట్ లో శోభాశెట్టి ఉంది.. ఈ వారం ఈ అమ్మడు హౌస్ లో రెచ్చిపోతుంది..బిహేవియర్, మాటలతో ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తోంది. అందుకే ఆమెను ఓట్లతో పాతాళనికి తొక్కేసినట్లుగా అనిపిస్తోంది. ఇదివరకు ఆరో వారం శోభా ఎలిమినేట్ కావాల్సింది. కానీ, ఆమెను సేవ్ చేసేందుకు బాగా ఆడిన నయని పావనిని బలి చేసింది బిగ్ బాస్ టీమ్. ఈవారం కూడా శోభా డేంజర్ జోన్‌లో ఉంది. మరి ఈసారైనా ఆమెను ఎలిమినేట్ చేస్తారా, లేక మరొకరిని బయటకు పంపిస్తారా అన్నది తెలియాల్సి ఉంది..
ఈ వారం ఎలిమినేషన్ పై జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.. ఒకవేళ శోభా శెట్టి ఎలిమినేట్ అయితే.. గతవారం శివాజీ అన్నట్లు పెద్ద చేప ఎలిమినేట్ అయినట్లే. పెద్ద చేపను పంపాలనుకుంటే సీరియల్ బ్యాచ్‌లో శోభా శెట్టి, ప్రియాంక, సందీప్ ముగ్గురిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావొచ్చు అని శివాజీ అన్నాడు. అలా ఈ ముగ్గురిలో పోల్చుకుంటే శోభా కంటే ప్రియాంక, సందీప్ చాలా బెటర్.. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వీకెండ్ ఎపిసోడ్ వరకు వెయిట్ చెయ్యాల్సిందే..
