NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్‏కే షాకిచ్చిన కంటెస్టెంట్స్.. ఆ టాస్క్ లో దొంగలుగా మారి..

Bb77

Bb77

బిగ్ బాస్ 7 ఉల్టా పుల్టా.. సీజన్ మొత్తం అలానే ఉంది.. ఒకరు అనుకుంటే మరొకరు ఎలిమినేట్ అవుతున్నారు.. మొన్నటివరకు పవర్ అస్త్ర కోసం హౌస్ మేట్స్ తర్జన భర్జన చేశారు.. ఇప్పుడు కెప్టెన్సీ కోసం ఆట ఆడాలంటూ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఇక మంగళవారం నాటి ఎపిసోడ్‏లో స్మైలీ టీత్ టాస్క్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంచాలకులుగా యావర్, శోభాను నియమించాడు. అయితే వారిద్దరూ గేమ్ ఆడుతూనే సంచాలకులుగా వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్‏బాస్. దీంతో కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ లో పెద్ద రచ్చే జరిగింది..

ఎవరు బెస్ట్ ఇచ్చారు యావర్ అనేది చెప్పలేక పోయాడు.. ఇక యావర్ చేసిన పనికి అందరు షాక్ అయ్యాయి.. అతని తీరు పై మండిపడ్డారు.. యావర్ నిర్ణయంపై ఇంటి సభ్యులు సీరియస్ అయ్యారు. ఫేవరిజం చూపిస్తున్నాడంటూ అరిస్తూ గోల చేశారు. ఇక తాజాగా విడుదలైన మరో ప్రోమోలో బిగ్‏బాస్ ఇచ్చిన టాస్క్ ను మార్చేశారు కంటెస్టెంట్స్. తాజాగా విడుదలైన ప్రోమోలో.. ‘నా స్నేహితుడు కొంతకాలంగా కొన్ని వస్తువులు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదు.. అందుకే మీకు ఒక టాస్క్ ఇస్తానని అన్నారు.. ఆ టాస్క్ ఏంటంటే దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర’ అంటూ టాస్క్ అనౌన్స్ చేశారు..

బిగ్‏బాస్ స్నేహితుడు యాక్టివిటీ ఏరియాలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అతడిని లేపకుండా చాలా జాగ్రత్తగా వస్తువులను దొంగిలించాల్సి ఉంటుంది అని చెప్పారు. ఇక కంటెస్టెంట్స్ కొన్ని వస్తువులను దొంగిలించిన తర్వాత.. గార్డెన్ ఏరియాలో నిల్చోన్న కంటెస్టెంట్స్ లో తేజ దగ్గరి నుంచి ఓ వస్తువు లాక్కుంది శోభా. దీంతో ఆమె వద్ద నుంచి దొంగిలించిన వస్తువు తీసుకోవడానికి యావర్ ప్రయత్నించాడు.. వెంటనే బిగ్ బాస్ చూసి మీరు వెంటనే జంటలుగా ఉండాలని కోరుతున్నా అని చెప్తాడు.. ఆ తర్వాత టాస్క్ అసలు స్వరూపాన్ని మార్చే స్వేచ్ఛ మీకు ఏమాత్రం లేదని.. కానీ అదేం పట్టించుకోకుండా మీకు నచ్చిన వస్తువులను పట్టుకొచ్చారు. కాబట్టి అడగనివి ఎన్ని దొంగిలించారనే విషయంపై నిర్ణయించడం జరుగుతుందని చెప్పారు బిగ్‏బాస్..మరి రేపటి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..