NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu: మళ్లీ అదే తప్పు చేసిన శోభా.. అశ్విని పై రెచ్చిపోయిన అమర్..

Bb Amar Aswini

Bb Amar Aswini

బిగ్ బాస్ తెలుగు 12 వారం నామినేషన్స్ హాట్ హాట్ గా సాగాయి.. హౌస్ లో ప్రస్తుతం కెప్టెన్ కోసం జరుగుతున్న టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ నువ్వా నేనా అని విజ్రూంభిస్తున్నారు.. నిన్నటి ఎపిసోడ్ లో కూడా అమర్ తో అనవసర విషయానికి గొడవ పెట్టుకుంది. గేమ్ ను గేమ్ లా ఆడలేక రచ్చ చేసింది శోభా శెట్టి. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ లో ఉన్న వారికి ఒకొక్కరికి ఒకొక్క క్యరెక్టర్ ఇచ్చాడు బిగ్ బాస్. హౌస్ లో హత్య జరిగిందని .. దాన్ని పోలీసులు అయిన అర్జున్, అమర్ దీప్ కనిపెట్టాలి అని చెప్పాడు. దాంతో ఎవరి పాత్రల్లో వారు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో అశ్విని, శోభా శెట్టికి రిపోర్ట్స్ పాత్ర ఇచ్చాడు బిగ్ బాస్..

ఈ టాస్క్ లో భాగంగా అమర్, అర్జున్ లకు పోలీసుల పాత్రలను చెయ్యమని చెప్పాడు.. ఇక హౌస్ లోన్ జరిగిన మిసెస్ బిగ్ బాస్ హత్య గురించి అనుమానం ఉన్న అందర్నీ ఇంట్రాగేట్ చేసి, ఆధారాలు సేకరించాలని చెప్పాడు. యావర్, ప్రియాంకలు బ్రదర్ అండ్ సిస్టర్లు, రతికా డ్రైవర్, గౌతమ్ రతికాను ప్రేమిస్తూ తిరిగే తోటమాలి, శివాజీ మిసెస్ బిగ్ బాస్ మేనేజర్, ప్రశాంత్ వంటోడు గా చెయ్యాలని బిగ్ బాస్ ఆదేశించారు.. అలానే ఎవరి క్యారెక్టర్ కు వాళ్లు న్యాయం చెయ్యనున్నారు..

ఇక బిగ్ బాస్ శివన్నను సీక్రెట్ రూమ్ లోకి రావాలని కోరాడు.. అర్జున్, అమర్ వెతుకుతున్న నేరస్థుడు మీరే. మీరు ఇంకొన్ని మర్డర్ లు చేయాల్సి ఉంటుంది అని చెప్పాడు. అలాగే ఒక ఫోన్ ఇచ్చి దాన్ని ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తగా ఉంచండి అని చెప్పాడు. అమర్, అర్జున్ నేరస్థుడ్ని కనిపెట్టే పనిలో ఉంటే వారిని విసిగించి బ్రేకింగ్ న్యూస్ రాబట్టే పనిలో అశ్విని , శోభా ఉన్నారు. ఈ క్రమంలో క్రైమ్ సీన్‌ లోకి రాకూడదు వెనక్కి వెళ్ళండి అని అమర్ అన్నాడు.. దాంతో శోభాకు కోపం టన్నుల కొద్ది వచ్చేసింది..

నువ్వు మాట్లాడేది నాకు నచ్చడం లేదు అంటూ గొడవకు దిగింది. అమర్ నేనేం చేశా అని అడుగుతున్నా శోభా మాత్రం రెచ్చిపోయి రంకెలేసింది. అంత ఇదిగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు.. అని అమర్ పై నోరు పారేసుకుంది.. ఇక అమర్ కు టెంపర్ ఉన్న విషయం తెలిసిందే.. చేతిలో ఉన్న లాటీని విసిరి కొట్టాడు.. అంతేకాదు మధ్య దూరిన అశ్విని పై కూడా రెచ్చిపోయాడు.. ముగ్గురి మధ్య కాసేపు పెద్ద యుద్ధమే జరిగింది.. మరి ఈరోజు ఎపిసోడ్ లో ఎలా ఉంటుందో చూడాలి..