NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu: మరోసారి రెచ్చిపోయిన రతిక.. రచ్చ రచ్చ చేసిన అర్జున్..

Bbrathikaa

Bbrathikaa

బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్స్ మాములుగా లేవని చెప్పాలి.. ఒక్కొక్కరు ఓ రేంజులో రెచ్చిపోయారు.. నువ్వా, నేనా అంటూ మాటల యుద్ధం చేశారు.. రతికా, అమర్, గౌతమ్, యావర్, అశ్విని, శోభా శెట్టి, అర్జున్, ప్రశాంత్ ఈవారం నామినేట్ అయ్యారు.. నామినేషన్స్ లో ఎప్పుడూ శోభ కాస్త ఓవర్ చేస్తుంది.. కానీ ఈసారి మాత్రం రతిక పాప రెచ్చిపోయింది.. ఈ ఎపిసోడ్ కు అమ్మడు రచ్చ హైలెట్ అయ్యింది.. ఇక నామినేషన్స్ తర్వాత నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో ప్రస్తుతం హౌస్ లో పదిమంది ఉన్నారు. ఎవరెవరు ఏ స్థానానికి అర్హులు అనేది తెలుసు కొసవడానికి బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు.

ఈ టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ ఈ పది వారాల్లో ఓవర్ ఆల్ పర్ఫామెన్స్ దృష్టిలో పెట్టుకొని. హౌస్ మేట్స్ తమకు గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన నెంబర్స్ దగ్గరకు వెళ్లి నిలబడాలని ఆ తర్వాత హౌస్ మేట్స్ అంతా చెర్చించి ఎవరు ఏ స్థానంలో ఉన్నారో డిసైడ్ చేసుకోవాలని చెప్పారు.. శివాజీ రతికాను లాస్ట్ వీక్ పర్ఫామెన్స్ మాత్రం 50 నుంచి 60 వరకు మాత్రమే వచ్చింది అని అన్నాడు. ఆతర్వాత అర్జున్ తన ఒపీనియన్ చెప్పాడు. 10 ప్లేస్ కరెక్ట్ అని నేను అనుకుంటున్నా అని చెప్పాడు. ఆతర్వాత రతికా శివాజితో డిస్కషన్ మొదలు పెట్టింది..

ఇకపోతే అమర్ నాకు ఒకటో స్థానంలో ఉండాలని ఉంది అని చెప్పాడు. లాస్ట్ వీక్ చూసిన దాన్ని బట్టి నేను ఆరో స్థానం అనుకుంటున్నా అని గౌతమ్ అన్నాడు. మొదటి స్థానం నాది అని మరీ మరి చెప్తున్నాను అని అన్నాడు అమర్. ఆతర్వాత రతికా ప్రియాంక, షోలతో ఎదో మాట్లాడింది. ఆతర్వాత అర్జున్ తో గొడవ పడింది. అర్జున్ గోడ మీద పిల్లిలా ఆన్సర్ చెప్పొద్దూ అని అనడంతో రతికా రెచ్చిపోయింది.. ఆ తర్వాత అర్జున్ కూడా రతిక పై కోపంతో రగిలిపోయాడు.. నోటికి వచ్చినట్లు అన్నాడుశోభా శెట్టిని నువ్వు ఇండివిడ్యువల్ గా నువ్వు చేయడం లేదు అని అనగానే నా ఎఫర్ట్స్ ఏం లేవా.? అని తిరిగి ప్రశ్నించింది శోభా. ఫైనల్ గా ఎడో స్థానం ఇవ్వడంతో కన్నీళ్లు పెట్టుకుంది.. మరి ఎవరికి ఏ స్థానం ఉంటుందో చూడాలి..