Site icon NTV Telugu

Bigg Boss7 Telugu : నాగార్జునను అరెస్టు చేయాలి.. తెలంణాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు..

Bb Host Nagarjuna

Bb Host Nagarjuna

తెలుగులో సక్సెస్ ఫుల్ టాక్ తో దూసుపోయిన ఏకైక షో బిగ్ బాస్.. ఇప్పటివరకు ఏడు సీజన్ లను పూర్తి చేసుకుంది.. బిగ్‌బాస్‌ సీజన్ 7 గ్రాండ్‌ ఫినాలే ఆదివారం జరిగింది. కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రైతుబిడ్డకు పల్లవి ప్రశాంత్ బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలుచుకుని విజేతగా నిలిచాడు.. అప్పటివరకు బాగానే ఉంది. కానీ ప్రశాంత్, అమర్ లు బయటకు రాగానే వారి ఫ్యాన్స్ రెచ్చిపోయారు.. ప్రశాంత్, అమర్‌దీప్‌, ఇతర ఇంటి సభ్యుల ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగాయి.

పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్‌దీప్‌, అశ్వినీ కారు అద్దాలను బద్దలు కొట్టడమే కాకుండా.. ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ స్పందించిన విషయం తెలిసిందే. ఆర్టీసీపై దాడి అంటే సమాజంపై దాడి చేసినట్లేనని హెచ్చరించారు.. ఇలా అభిమానం పేరుతో చేసే పిచ్చి చేష్టలు సమాజానికి మంచిది కాదని కొందరు ప్రముఖులు సైతం ఈ ఘటన పై మండిపడుతున్నారు..

ఇదిలా ఉండగా.. అడ్వకేట్‌ అరుణ్‌ కుమార్‌ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న నాగార్జున షో నిర్వాహకులను అరెస్ట్‌ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. బిగ్‌బాస్‌ పేరుతో అక్రమంగా 100 రోజుల పాటు కంటెస్టెంట్లను నిర్భందించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటీషన్ వేశారు. బిగ్‌బాస్‌ పోటీలో ఉన్న వారిని విచారించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇదే విషయం పై మహిళ కమిషన్‌ ఛైర్మన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని పిటీషనర్‌ అరుణ్‌ కుమార్‌ వెల్లడించారు. అలాగే ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడం వెనకున్న కుట్రను బయటకు తీయాలని ఆయన డిమాండ్‌ చేశారు..

Exit mobile version