NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu: అతను చాలా కన్నింగ్.. అసలు విషయాలు బయట పెట్టిన దామిని..

Damini

Damini

బిగ్ బాస్ సీజన్ 7 రసవత్తరంగా సాగుతుంది..మూడో వారం కూడా ఇంటి నుంచి ఒకరు బయటకు వెళ్లారు.. మొదటి వారం హౌస్ నుంచి కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ కాగా రెండో వారం షకీలా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు.. ఇక మూడోవారం సింగర్ దామిని ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చింది.. హౌస్ లో మొదటి నుంచి చాలా యాక్టివ్ గా ఉంటూ లోపల ఉన్నవారికి వండిపెడుతూ .. ప్రేక్షకులను ఆకట్టుకున్న దామని మిగిలిన టాస్క్ లో సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చింది. దాంతో ఆమెకు ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో ఓట్లు వేయలేదు. దాంతో మూడో వారం హౌస్ నుంచి బయటకు వచ్చింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన దామిని లోపల ఉన్నవారికి సలహాలు ఇచ్చింది. నాగ్ చెప్పినట్టుగా హౌస్ లో ఉన్న వారి ఫొటోలతో ఉన్న బెలూన్ ను పగల గొట్టి ఒకొక్కరికి సలహాలు ఇచ్చింది..

ఈ విషయంపై శివాజీ, దామినిల మధ్య పెద్ద గొడవ జరిగింది.. బిగ్ బాస్ నుంచి బయకు వచ్చిన దామని బిగ్ బాస్ ఇంటర్వ్యూ లో పాల్గొంది.. ఈ షోకు మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్ హోస్ట్ గా చేస్తున్న ఈ ఇంటర్వ్యూకు వచ్చిన దామిని హౌస్ లో ఉన్నవారి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. దామిని చేతికి బొమ్మలు ఇచ్చి హౌస్ లో ఉన్నవారు ఒక్కక్కరి గురించి చెప్పమని అంది గీతూ. దాంతో హౌస్ లో ఉన్న ఒక్కక్కరి గురించి చెప్తూ వచ్చింది దామిని. తాజాగా ఈ ఇంటర్వ్యూ ప్రోమో విడుదల చేశారు..

అందులో దామిని మాట్లాడుతూ..రతికా గురించి మాట్లాడుతూ.. ఆమె సగం సగం వింటుంది అని అంది దామిని. యావర్ ను కొంచం అర్ధం చేసుకో అని, శుభ శ్రీ గురించి బార్బీ డాల్ గా రెడీ అవ్వడం మానేసి అప్పుడప్పుడు పని చెయ్ అని చెప్పింది. తేజ.. వెటకారం తగ్గిచుకో.. పని దొంగవు నువ్వు అని అంది. అలాగే శోభా శెట్టి గురించి చెప్తూ.. తేజాను అన్నిపనులు చెయ్యొద్దని చెప్పు అని అంది. అలాగే గౌతమ్ గురించి మాట్లాడుతూ.. అన్ని నీకే తెలుసు అని అనుకోకు అని అంది. ప్రశాంత్ పేరు చెప్పగానే బొమ్మను పక్కన పెట్టేసేయండి అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తుంది.. శివాజీ గురించి చెప్తూ ఆయన చాలా చాలా కన్నినింగ్ గేమ్ ఆడుతున్నాడు అని తెలిపింది.. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..