బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ఇప్పుడు రసవత్తరంగా సాగుతుంది.. 13వ వారం కూడా పూర్తయింది. ఫైనల్ కి చేరుకున్న అర్జున్ ని ముందే ఎలిమినేషన్ నుంచి తప్పించారు. ఆ తర్వాత ఆదివారం ఎపిసోడ్ కావడంతో కాసేపు ఎంటర్టైన్ చేసారు. ఈ ఎపిసోడ్ కు గెస్ట్ గా హీరో నాని వచ్చి సందడి చేశారు. ఇక హౌస్ మెట్స్ తో సరదాగా మాట్లాడారు.. అలాగే నా సామి రంగ సినిమా నుంచి హీరోయిన్ ఆషిక రంగనాధ్ వచ్చి కాసేపు సందడి చేశారు.
ఆ తర్వాత నామినేషన్స్ లో ఉన్న ప్రియాంక, శివాజీ, యావర్ సేవ్ అవ్వగా చివరికి ప్రశాంత్, శోభా, గౌతమ్ లు మిగిలారు. ప్రశాంత్ దగ్గర ఎవిక్షన్ పాస్ ఉండటంతో అది వేరే వాళ్ళ కోసం ఉపయోగించాలని లేదా తిరిగి ఇచ్చేయాలని నాగార్జున చెప్పాడు. చాలా సేపు ఆలోచించుకొని, లెక్కలు వేసుకొని ప్రశాంత్ బాగుపడితే తాను బాగుపడాలి తప్ప పక్కనోళ్లు మాత్రం బాగుపడకూడదని ఆ ఎవిక్షన్ పాస్ ఎవరికోసం ఉపయోగించకుండా తిరిగి ఇచ్చేశాడు…ప్రశాంత్, శోభా సేవ్ అయి గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. అసలు ఎవరికీ అంతగా తెలియని యాక్టర్ గా ఎంట్రీ ఇచ్చి గౌతమ్ 13 వారాలు హౌస్ లో ఉన్నాడంటే గ్రేట్ అనే చెప్పొచ్చు..
ఇక బిగ్ బాస్ విన్నర్ అయితే ఎంత డబ్బులు వస్తుంది అనేది ఆసక్తిగా మారింది.. ఏమేమి వస్తాయో నాగార్జున కంటెస్టెంట్స్ కి తెలిపాడు. ఈ సీజన్ లో బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన వాళ్లకి 50 లక్షలతో పాటు 15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్, ఒక మారుతి కారు అందుకుంటారని తెలిపారు. అనంతరం ఈ డబ్బు గెలిస్తే ఎవరు ఏం చేస్తారు అని కంటెస్టెంట్స్ ని అడిగాడు నాగార్జున. కంటెస్టెంట్స్ అంతా ఇల్లు కట్టుకుంటామని, పేరెంట్స్ కోసం ఉపయోగిస్తామని, తమ కష్టాలు తీర్చుకుంటామని ఇలా చెప్పడంతో కాసేపు ఫ్యామిలీ డ్రామాగా సాగింది..