బిగ్ బాస్ సీజన్ 7 దాదాపు ఎండింగ్ కు వచ్చేసింది.. ఈ క్రమంలో గత రెండు రోజులుగా బిగ్ బాస్ వరుసగా టాస్క్ లను ఇస్తున్నాడు.. ఫినాలే అస్త్ర టికెట్ కోసం హౌస్మేట్స్ పోటీపడుతున్నారు.. ఇప్పటివరకు హౌస్ లో టాప్ రేటింగ్ తో అమర్ ఉండగా రెండవ స్థానంలో అర్జున్ ఉన్నాడు. ఆ తర్వాత స్థానాల్లో యావర్, ప్రశాంత్ ఉన్నారు. ఇక ఇప్పటికే ఫినాలే రేసు నుంచి శోభా, శివాజీ అవుట్ అయ్యారు. ఇక ఈరోజు ప్రోమో రిలీజ్ అయ్యింది. తాజాగా వీడియోలో ఫినాలే రేసు నుంచి అవుట్ కావడంతో శోభా ఏడుస్తూనే ఉంది.
ఇక స్కోర్ బోర్డు నుంచి తన ఫోటోలను తీసేసింది. దీంతో అలా తీయకూడదు శోభా అంటూ అమర్, ప్రియాంక చెప్పడంతో … నేను తట్టుకోలేకపోతున్నాను.. అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.. ఆ తర్వాత ఫినాలే అస్ట్ర కోసం మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్.. అదే ఎత్తర జెండా అనే టాస్క్ ఇచ్చి.. దీనికి శోభా శెట్టి, శివాజీలను సంచాలకులుగా నియమించారు. అయితే ఒక్కొక్కరికి కేటాయించిన పడవను ఇసుకతో నింపితే.. వారి పడవకు మరో పక్కనున్న జెండా పైకి లేస్తుంది. ఎవరి జెండా అయితే ముందే పైకి లేస్తుందో వారే విజేతలు. అయితే ఈ ఇసుకను కేవలం చిన్న జగ్గుతో మాత్రమే తీసుకొచ్చి పడవలో పోయాల్సి ఉంటుంది.. ఈ టాస్క్ లో డాక్టర్ బాబు తెలివిని ఉపయోగించాడు..
ఇక్కడ సంచాలకులుగా ఉన్న శివాజీ, శోభాలతో వాదించాడు గౌతమ్. ఇది ఫౌల్ గేమ్ కాదు.. ముందు మీరు రూల్స్ అంటూ అతి తెలివి చూపించాడు. దీంతో మధ్యలోనే బిగ్ బాస్ కల్పించుకుని డాక్టర్ బాబుకు షాకిచ్చాడు. జెండా వైపు నుంచి ఎంత ఇసుకను తీశారో మళ్లీ అటు వైపు నింపండి అని అన్నారు బిగ్ బాస్ . దీంతో సైలెంట్‌గా ఆ పని చేశాడు.. కాసేపు శోభా, గౌతమ్ మధ్య రభస జరిగింది.. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..