NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu: నామినేషన్స్ లో రెచ్చిపోయిన కంటెస్టెంట్స్.. కన్నీళ్లు పెట్టుకున్న రైతుబిడ్డ..

Amar Vs Prasanth

Amar Vs Prasanth

బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ముగింపుకు చేరుకుంది.. ప్రస్తుతం హౌస్ లో చివరివారం ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ నిన్న జరిగాయి.. నువ్వా నేనా అంటూ కొట్టుకున్నంత పనిచేశారు హౌస్మేట్స్. ముఖ్యంగా అమర్ వర్సెస్ ప్రశాంత్ ఇద్దరి మధ్య తారాస్థాయిలో గొడవ జరిగింది. ఇక గతవారం ఫినాలే అస్త్ర గెలుచుకోవడంతో అర్జున్ అంబటి అతడిని ఎవరు నామినేట్ చేయడానికి వీలు లేదు. ఇక ఈ వారం మిగిలింది SPA బ్యాచ్ vs SPY బ్యాచ్. దీంతో ఈ రెండు టీంలు రెచ్చిపోయారు.. ప్రతి నామినేషన్స్ లో లాగే ఇప్పుడు కూడా ప్రశాంత్ పై అమర్ రెచ్చిపోయాడు..

ఇక  సహనం కోల్పోయి ప్రశాంత్ ను గుండెలతో నెట్టుకుంటూ పోయాడు. రెండు సార్లు కెప్టెన్సీలో సపోర్ట్ చేసినందుకు అమర్ దీప్ చేసిన నమ్మక ద్రోహాన్ని తట్టుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రశాంత్.. ప్రశాంత్ అమర్ ను నామినేట్ చెయ్యగా, అయితే అమర్ తిరిగి ప్రశాంత్ ను నామినేట్ చేస్తూ.. సిల్లీ, సిల్లీ రీజన్స్ చెప్తూ నామినేట్ చేస్తున్నాడని అన్నాడు. దీంతో ప్రశాంత్ తన బాధను బయటపెట్టాడు. ‘నీ నిజస్వరూపం మళ్లీ బయటపడింది. నువ్వు మోసం చేసే రకం. నీ గుణమే అది’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు ప్రశాంత్.. వీరిద్దరి ఫైట్ తో హౌస్ లో కాసేపు హైడ్రామా సాగింది..

ఆ తర్వాత ఒకరిపై ఒకరు అరుచుకుంటూ మీదకు వెళ్లారు. దీంతో శివాజీ మధ్యలో కల్పించుకుని ఇద్దరిని విడదీశాడు. అయితే నామినేషన్స్ తర్వాత అమర్ చేసిన మోసాన్ని గుర్తుచేసుకుని భోరున ఏడ్చేశాడు ప్రశాంత్. ఫినాలే అస్త్రలో అర్జున్ అన్న, నువ్వు ఉంటే నా పాయింట్స్ నీకే ఇస్తానని యావర్ తో చెప్పిని. నిన్ను సపోర్ట్ చేసినందుకు నన్ను మోసం చేశావ్.. నా గుండెలపై తన్నావ్. నీ గురించి ఒక్కమాట పక్కకు వచ్చి మాట్లాడలేదు అంటూ ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్.. తనను ఎవరైతే సపోర్ట్ చేశారో వారిని టార్గెట్ చేస్తూ వస్తున్నాడు అమర్.. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.. ఏది ఏమైనా ఈరోజు నామినేషన్స్ కూడా మరింత హీటును పెంచేలా ఉన్నాయి..