NTV Telugu Site icon

Bigg Boss 7 Telugu: ఓట్ అప్పీల్ ఛాన్స్ ఇచ్చిన బిగ్ బాస్.. కన్నీళ్లు పెట్టుకున్న శోభా..

Bb14

Bb14

బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ పై జనాల్లో మంచి అభిప్రాయం ఏర్పడింది.. గతంలో వచ్చిన సీజన్ లతో పోలిస్తే ఈ సీజన్ కాస్త డిఫరెంట్ గా ఉంది.. ప్రస్తుతం 14 వ వారంలో ఉంది.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది ఆసక్తిగా మారింది.. మంగళవారం ఎపిసోడ్ లో నామినేషన్స్ హీటు కనిపించింది. అమర్ ,ప్రశాంత్ మధ్య కోల్డ్ వార్ జరిగింది. అమర్ ప్రశాంత్ ను రెచ్చగొట్టేలా మాట్లాడుతూనే.. తాను అన్న మాటలను సమర్ధించుకునే ప్రయత్నం చేశాడు.. ఇక ఆ తర్వాత సీక్రెట్ టాస్క్ తో కాస్త నవ్వులు పూయించాడు అమర్ …

ఇక బ్యాచ్ ముచ్చట్లు సాగాయి. సీరియల్ బ్యాచ్ ఒక వైపు, శివాజీ బ్యాచ్ ఓవైపు కూర్చొని ఒకరిగురించి ఒకరు చెప్పుకున్నారు. ఆ తర్వాత టీవీలో ప్రో కబడ్డీ ప్రోమోను చూపించారు బిగ్ బాస్. అందులో బాలకృష్ణను చూడగానే శివాజీకి మంచి ఊపొచ్చింది. బాలయ్యను చూసిన ఆనందంలో విజిల్స్ కొట్టి సందడి చేశాడు. చివరిలో జై బాలయ్య అంటూ నినాదాలు చేశాడు. ఆతర్వాత సీరియల్ బ్యాచ్ అంతా ఒక దగ్గర చేరారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ పై అమర్ మరోసారి ప్రియాంక , శోభా దగ్గర చెప్పాడు. అర్జున్ కూడా ప్రశాంత్ గురించి ఎదో చెప్పాడు.. తాను అమ్మడు మేకప్ పై కామెంట్ చేశాడు.. అది పెద్ద రచ్చ అయ్యింది..

ఆ తర్వాత అందరిని కూర్చోబెట్టి చిల్ పార్టీ అంటూ ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ . బజర్ మోగినప్పుడు స్విమింగ్ పూల్‌లోకి దూకి డ్యాన్స్ చేయాలి.. ఎవరు లేటుగా పూల్ లోకి దూకుతారో వారు అవుట్ అయినట్టు అని చెప్పాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ముందు అమర్ అవుట్ అయ్యాడు. ఆతర్వాత సంచలక్ గా మారి లేటుగా దూకిన వారి పేర్లు బిగ్ బాస్ కు చెప్పాడు. శోభా ఈ టాస్క్ లో అవుట్ అవ్వగానే ఏడుపు మొదలు పెట్టింది నేను బ్లాంక్ అయ్యానురా..ఆ తర్వాత కూడా మరో టాస్క్ లో కూడా అమ్మడు కన్నీళ్లు పెట్టుకుంది.. మరి ఈరోజు ఎలాంటి టాస్క్ లను బిగ్ బాస్ ఇస్తాడో చూడాలి..

Show comments