Site icon NTV Telugu

Bigg Boss 7 Telugu: టాస్క్ లో రెచ్చిపోయిన భోలే.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అమర్ దీప్..

Amar Bhole

Amar Bhole

బిగ్ బాస్ సీజన్ 7 లో రోజూ రోజుకు రసవత్తరంగా మారుతుంది.. తొమ్మిదో వారం నామినేషన్స్ పూర్తయ్యాయి..నిన్నటి ఎపిసోడ్ లో భోలే రెచ్చిపోయాడు.. అమర్ కూడా భోలే పై ఒంటి కాలిపై లేచాడు.. వారిద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాధం చోటు చేసుకుంది.. శోభా శెట్టి ముందుగా రతికాను నామినేట్ చేసింది. ఈ ఇద్దరి మధ్య గట్టిగానే గొడవ జరిగింది. ఇద్దరు మధ్య వాదన ఓ రేంజ్ లో జరుగుతుంటే మధ్యలో తేజ పేరు వచ్చింది. రాగానే మనోడు నాపేరు ఎందుకు తీస్తున్నవ్ అంటూ ఎదో చెప్పబోయాడు. ఇంతలో రతికా నువ్వు మధ్యలో దూరకు అంటూ తేజ పై రెచ్చిపోయింది..

ఇక తేజ ప్రేక్షకులకు అడ్డంగా దొరికిపోతున్నావ్ అనగానే నోరుమూసుకుంది.. ఆ తర్వాత శోభా గురించి చెప్పింది.. దానికి మనం ఫైర్ బ్రాండ్ తన యాటీట్యూడ్ చూపించింది..హౌస్‌లో నేను గ్రూప్ గేమ్ ఆడటానికే వచ్చాను.. షోకి ముందే అంతా ఫిక్స్ చేసుకుని వచ్చాను.. నేను ఇలాగే ఆడతాను.. సరేనా అంటూ యాటిట్యూడ్ చూపించింది శోభా. దాంతో రతికా ముందు విను. విన్న తర్వాత మాట్లాడు.. నీకు ఏమైనా మెమొరీ లాస్ ఉందా అనగానే ఇక శోభా నోటికి పని చెప్పింది..

ఆ తర్వాత యావర్ నువ్వు ఫౌల్ గేమ్ ఆడావా? లేదా? అని శోభాను అడిగాడు.. దానికి ఆడాను అను ఒప్పుకుంది శోభ అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నా అని కౌంటర్ ఇచ్చాడు యావర్. ఆతర్వాత అశ్వినిని నామినేట్ చేశాడు యావర్. దాంతో అశ్విని షాక్ అయ్యింది. నువ్వు చాలా కన్ఫ్యూజ్‌గా ఉన్నావ్..అంటూ ఎదో సిల్లీ రీజన్ చెప్పాడు యావర్. దాంతో ఇద్దరి మధ్య వాదన జరిగింది. ఇక అమర్ భోలేను నామినేట్ చేశాడు.. ఆ తర్వాత నిన్ను చూస్తుంటే పదేళ్ల పిల్లాడిలా ఉన్నావ్ అంటూ అమర్ పై ఫైర్ అయ్యాడు భోలే. దానికి సరే సార్ నేను బ్యాడ్ బాయ్.. మీరు గుడ్ బాయ్.. మీరు గ్రేట్ .. మీరు సూపర్.. నేనేదో పదేళ్ల పిల్లాడిని అంటూ తన స్టైల్ లో భోలే కి కౌటర్లు ఇచ్చాడు అమర్. దానికి భోలే నువ్వు బిగ్ బాస్‌కి వచ్చి.. ఆడింది ఇరగదీసింది ఏం లేదు.. అంటూ ఇద్దరు తగ్గకుండా కౌంటర్స్ ఇచ్చుకున్నారు.. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Exit mobile version