Site icon NTV Telugu

Bigg Boss 7 Telugu: రైతు బిడ్డకు ఊహించని దెబ్బ.. అమర్ ను ఓ ఆట ఆడుకున్న బిగ్ బాస్..

Bigg Boss Amar

Bigg Boss Amar

బిగ్ బాస్ ప్రస్తుతం వరుస ట్విస్ట్ లను ఇస్తున్నారు.. మొన్నటివరకు కలిసి ఉన్న అందరు.. ఇప్పుడు నువ్వా, నేనా అంటూ రెచ్చి పోతున్నారు.. గత ఎపిసోడ్ లో ప్రశాంత్ ను కెప్టెన్ గా పనికి రాడని అందరు అంటారు.. అతడిని కెప్టెన్ గా తొలగించాడు. దీంతో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన మాట ఎవరు వినడం లేదంటూ అంతకుముందే బిగ్‏బాస్ ముందు మొర పెట్టుకున్నాడు ప్రశాంత్. అయినప్పటికీ అదేం పట్టించుకోకుండా హౌస్మేట్స్ నిర్ణయం ప్రకారం ప్రశాంత్‏ను కెప్టెన్ గా తొలగించారు. అంతేకాదు ఆ ప్రోమోతో ప్రశాంత్ రేంజ్ మరింత పెరిగిందని చెప్పడంలో సందేహం లేదు.

ఇదిలా ఉండగా తాజాగా విడుదల చేసిన ప్రోమోలో మాత్రం కంటెస్టెంట్లను పరుగులు పెట్టించాడు బిగ్‏బాస్. కలర్ కలర్ విచ్ కలర్ అంటూ టాస్క్ ఇచ్చి.. ఒక్కొక్కరికి చుక్కలు చూపించాడు. ఇక సీరియల్ హీరో అమర్ కు చుక్కలు చూపించాడు.. ఇక టాస్కులో భాగంగా బిగ్‏బాస్ చెప్పిన కలర్ ఉన్న వస్తువులు ఇంట్లో నుంచి తీసుకువచ్చి బయట వెయ్యాల్సి ఉంటుంది. ఇందులో ముందుగా కలర్ కలర్ విచ్ కలర్ బిగ్‏బాస్.. అని అడగ్గా.. ముందుగా గ్రీన్ అని చెప్పినట్లు తెలుస్తోంది. అక్కడే గ్రీన్ గడ్డిని తీసి బాక్స్ లో వేసింది అశ్విని.

ఆ తర్వాత ఆమె వేసిన వస్తువును గుర్తించి తనకు చూపించాలని అడగ్గా.. తను వేసిన వస్తువును తనే చూపించలేకపోయింది. ఇక ఆ తర్వాత లెమన్ కలర్ అని బిగ్‏బాస్ చెప్పగా.. సందీప్ గ్రీన్, అర్జున్ అంబటి ఎల్లో కలర్ చైర్స్ తీసుకువచ్చారు.. స్కూల్లో కలర్స్ నేర్చుకోలేదా అంటూ షాక్ ఇచ్చాడు బిగ్ బాస్.. అశ్విని, అమర్ దీప్ స్పూన్స్ తీసుకువచ్చారు. దీంతో ఆ రెండు స్పూన్లలో దేనితో స్విమ్మింగ్ ఫూల్‏ను ఖాళీ చేయొచ్చు అని అడగ్గా.. తన చేతిలో ఉన్న స్పూన్ తో చేయోచ్చు అంటూ అతి తెలివి ప్రదర్శించాడు అమర్ దీప్. దీంతో తన చేతిలోని స్పూన్ తో స్విమ్మింగ్ ఫూల్ ఖాళీ చేయాలని ఆదేశించాడు బిగ్‏బాస్.. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version