Bigg boss 6: బిగ్ బాస్ షో అంటేనే కంటెస్టెంట్స్ ఎత్తులను చిత్తు చేసేది. ఎవరెవరు బాగా దగ్గర అవుతున్నారని బిగ్ బాస్ భావిస్తాడో వారి మధ్యే పోటీ పెట్టేస్తాడు. లేదంటే సీక్రెట్ టాస్కులు ఇచ్చి, ఓ ఆట ఆడుకుంటాడు. పూర్తి స్థాయిలో అలా కాకపోయినా ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌ను అలాంటి ఓ సెంటిమెంట్ తో హౌస్ మేట్స్ అందరికీ లింక్ చేస్తూ పెట్టేశాడు బిగ్ బాస్.
Read Also: Samantha: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? వైరల్ అవుతున్న ఫోటో
ఓ బ్యాటరీని నూరుశాతం ఛార్జ్‌తో హౌస్‌లో పెట్టారు. ఒక్కొక్కరిని కన్ ఫెషన్ రూమ్ కు పిలిచి, మూడు ఆప్షన్స్ ఇచ్చి అందులో ఏ కోరిక నెరవేర్చుకోవాలనుకున్నా బ్యాటరీలో కొంత ఛార్జ్ ను కోల్పోవాల్సి ఉంటుందని చెప్పాడు బిగ్ బాస్. ఇతర ఇంటి సభ్యులకు ఛాన్స్ ఇవ్వాలని ఎవరైనా తమ కోరికలను పక్కన పెట్టాలని చూసినా, బిగ్ బాస్ అంగీకరించలేదు. ఖచ్చితంగా ఏదో ఒక ఆప్షన్ తీసుకోవాల్సిందేనని షరతు పెట్టాడు. దాంతో శ్రీహాన్ ఇంటి నుండి బిర్యానీ తెప్పించుకోగా, ఆదిరెడ్డి తన భార్యతో వీడియో కాల్ మాట్లాడాడు. సుదీప్ తన భర్తతో ఫోన్ లో మాట్లాడింది. ఈ ముగ్గురి ఛాన్స్ తోనే తొలి రోజు బ్యాటరీలో 95 శాతం ఛార్జ్ అయిపోయింది. అయితే ఈ బ్యాటరీని రీఛార్జ్ చేయడం కోసం కూడా బిగ్ బాస్ మరికొన్ని టాస్కులు పెట్టాడు. ఆ ఎపిసోడ్ బుధవారం ప్రసారం కాబోతోంది. రీఛార్జ్ తర్వాత ఎవరెవరి కోరికలు ఏ విధంగా నెరవేరాయో చూడాలి. పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ మీద ప్రేమ ఒకవైపు, తమతో బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న స్నేహితుల కోరిక నెరవేర్చాలనే ఆశ మరోవైపు… ఈ రెండింటిలో ఎటు వైపు మొగ్గు చూపాలో తేల్చుకోలేక కొందరు సభ్యులు కన్నీరు మున్నీరు కావడం విశేషం.