NTV Telugu Site icon

Womens: మహిళలు గాజులు ఎందుకు వేసుకుంటారో తెలుసా.. అంత అర్థం ఉందా?

Bangles

Bangles

పెళ్ళైన ప్రతి మహిళలు ఖచ్చితంగా గాజులు, బొట్టు, పూలు ఉండటం సహజం.. అయితే గాజులు వేసుకోవాలని పెద్దలు పదే పదే చెబుతుంటారు.. గాజులు మనకు రక్షణగా ఉంటాయి. మహిళలు చేతుల కి గాజులు వేసుకుంటే ఏ కీడు జరగదు. అప్పుడే పుట్టిన పిల్లలకి నల్ల గాజులు వేస్తుంటారు. అలా చేయడం వల్ల దిష్టి తగలదు. దోషాలు వంటివి కూడా రాకుండా ఉంటాయి అని పండితులు చెబుతున్నారు..

అమ్మాయిలు అమ్మవారికి ప్రతి రూపాలు.. చేతికి నిండుగా గాజులు ధరిస్తే ఆ ఇంట లక్ష్మీదేవి కూడా ఉంటుందని పెద్దలు చెబుతున్నారు.. రకరకాల రంగు రంగుల గాజులు మనకి అందుబాటులో ఉంటాయి. ఆ రంగులకి కూడా రకరకాల అర్థాలు ఉన్నాయి.. ముఖ్యంగా చెప్పాలంటే ఊదా రంగుస్వేచ్ఛను సూచిస్తుంది.. నీలం రంగు విజ్ఞానాన్ని, ఆకుపచ్చ అదృష్టాన్ని సూచిస్తాయి… అదే విధంగా పసుపు రంగులు కుటుంబాంలో సంతోషాన్ని కలిగిస్తుంది..

ఇలా గాజులు మాత్రమే కాదు రంగుల గాజులకు కూడా ఎన్నో అర్థాలు కూడా ఉన్నాయి. ఇక మనకు ఎంత బంగారపుట్టినరోజు గాజులు ఉన్నా కూడా మట్టి గాజులను కూడా వేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. మహిళలు కుంకుమతో పాటు గాజును కూడా అమ్మవారికి పెట్టి పూజిస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే మట్టి గాజులు వేసుకుంటే ముత్తయిదువుతనాన్ని అది సూచిస్తుంది.అలాగే గాజుల ను వేసుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని పండితులు చెబుతున్నారు.. అందుకే ప్రతి ఆడ పిల్ల కూడా గాజులను వేసుకోవడం మంచిది..