NTV Telugu Site icon

Ganesh chathurthi: ఈ మంత్రం చెప్తూ గణేష్ నిమజ్జనం చేస్తే 100 శాతం పూజాఫలం

Untitled 18

Untitled 18

Bhakti: విఘ్నాలు తీర్చే విగ్నేశ్వరుడిని పూజించనిదే ఏ పని ప్రారంబించరు. తొలి పూజా వినాయకుని చేశాకే వేరే ఏ దేవునికైన పూజా చేస్తారు. అలాంటి విగ్నేశ్వరుని జన్మదిన వేడుకైన వినాయక చవితి వస్తుంది అంటే పండుగకి నెల రోజుల ముందు నుండి సందడి మొదలవుతుంది. ఇక భాద్రపదమాసం శుక్లపక్షం చవితి రోజు వినాయకుని ప్రతిమని మండపంలో ప్రతిష్టించడం ద్వారా మొదలైన వేడుక నిమజ్జనంతో ముగుస్తుంది. అయితే ఎవరి శక్తి తగట్టు వాళ్ళు 1 రోజు నుండి 11 రోజుల వరకు ఈ పండుగను జరుపుకుంటారు. కాగా బేసి సంఖ్య రోజుల్లో మాత్రమే నిమజ్జనం చెయ్యాలి. అయితే అన్ని రోజులు భక్తితో శ్రద్ధగా పూజలు చేసిన భక్తులు నిమజ్జనం కూడా అలానే చెయ్యాలి. ఎలా చేస్తే పూర్తి ఫలితం దక్కుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Read also:Immersion of Ganesh idol : వినాయకుని విగ్రహాలు ఎందుకు నిమజ్జనం చేస్తారో తెలుసా..?

భక్తులు వినాయకుణ్ణి నిమజ్జనం చేసే రోజు కూడా యధావిధిగా రెండు పూటలా అంటే ఉదయం సాయంత్రం పూజ చేసి నైవేద్యం పెట్టాలి. సాయంత్రం పూజా చేసేటప్పుడు వెలిగించిన దీపం కొండెక్కేవరకు వేచి ఉండాలి. దీపం కొండెక్కిన తర్వాత వినాయకుని ప్రతిమ మండపంలో పెట్టేటప్పుడు వినాయకుని బొడ్డులో పెట్టిన రూపాయి లేదా రెండు రూపాయల నాణెంని తీసుకుని దాచుకోవాలి. ఇలా ఆ నాణెంని ఇంట్లో ఉంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. అనంతరం వినాయకుని ప్రతిమని అలానే వినాయకుని పూజలో ఉపయోగించిన పత్రీ, పూలు మదలైనవాటిని మండపంలో నుండి తీసుకుని నది దగ్గరకి గాని కాలువకు లేదా చెరువు దగ్గరకి తీసుకు వెళ్ళాలి. వినాయకుణ్ణి ఎపుడు చూస్తూ నిమజ్జనం చేయకూడదు. వెనక్కి తిరిగి “యధాస్థానం ప్రవేశయామి.. పూజార్థం పునరాగమనాయచ” అనే మంత్రాన్ని జపిస్తూ వినాయకుని ప్రతిమని వదిలెయ్యాలి. ఇలా చేస్తే పూజాఫలితం పూర్తిగా వస్తుందని పండితులు చెప్తున్నారు.