Site icon NTV Telugu

Diwali Lakshmi Puja 2025: రేపే దీపావళి.. లక్ష్మీదేవిని ఎందుకు పూజించాలో తెలుసా..?

Laxmi Puja

Laxmi Puja

Diwali Festival 2025: దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి పూజ చేయడానికి అనేక పౌరాణిక, ధార్మిక, సాంస్కృతిక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పండగ రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి తన తేజస్సుతో చీకటిని తరిమి కొట్టి భక్తులను అనుగ్రహిస్తుందని నమ్ముతారు. మహాలక్ష్మీని సంపద, అదృష్టం, శ్రేయస్సు, వైభోగానికి అధినేత్రిగా భావిస్తారు. ఈ దీపావళి పండగ రోజున అమ్మవారిని పూజించడం వల్ల ఆ ఏడాది మొత్తం తమ ఇంట్లో ధనం, ధాన్యం, ఆనందం కొలువై ఉండాలని కోరుకుంటారు. అలాగే, పురాణాల ప్రకారం, కార్తీక అమావాస్యకు ముందు వచ్చే త్రయోదశి రోజున లక్ష్మీదేవి క్షీరసాగర మథనం నుంచి ఉద్భవించి.. ఆ మరుసటి రోజు అమావాస్య రాత్రి దీపావళి రోజున విష్ణుమూర్తిని వరించి, స్థిరంగా ఉండేలా వరాన్ని ప్రసాధించింది. అందుకే ఈ పర్వదినం నాడు లక్ష్మీదేవిని పూజించడం అత్యంత ప్రీతికరమైందిగా భక్తులు భావిస్తారు.

Read Also: అల్లం తినడం వల్ల శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే !

అయితే, దీపావళి పండుగ రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి? అని కొందరికి అనుమానం ఉంటుంది. ఈ దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి, తన తేజస్సుతో అజ్ఞానమనే చీకటిని తరిమేసి, భక్తులను ధనం, ధాన్యం, ఆనందాన్ని ప్రసాదిస్తుందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. అందుకే, ఈ పండుగ రోజున దీపాలు పెట్టి అమ్మవారిని ఆహ్వానించాలనే ఆచారాన్ని మనం అనాది కాలంగా పాటిస్తున్నాం.. నేడు ఇలా దీపాలు వెలిగిస్తే అమ్మవారు మనపై అనుగ్రహం చూపి సిరి సంపదలు అందజేస్తుందని నమ్మకం. ఆర్థిక స్థితి మెరుగై, కుటుంబంలోని సమస్యలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.

Exit mobile version