NTV Telugu Site icon

Vishnu Pooja: విష్ణువును పూజించడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో తెలుసా?

Lord Vishnu

Lord Vishnu

భారతీయులు ఎక్కువగా పూజించే దేవుళ్లలో విష్ణువు కూడా ఒకరు.. హిందూ మతానుసారం సృష్టికి సంరక్షకుడు, రక్షకుడు మహా విష్ణువు. ఆయన సర్వ శక్తిమంతుడు, సర్వస్వం వ్యాపించినవాడు. పురాణాల ప్రకారం 22 సార్లు పునర్జన్మ పొందాడు మహా విష్ణువు. అందులో సృష్టిని రక్షించడానికే ఏకంగా 10 జన్మలను ఎత్తేడు. నరసింహుని పురాణం విష్ణువు సర్వవ్యాప్తి అని చెప్పడానికి ఉదాహరణగా నిలుస్తుంది. కృష్ణుని రూపంలో భగవంతుడు కర్మయోగం ప్రాముఖ్యత ఏమిటో తెలిపాడు.. విష్ణు మూర్తిని ఎలా పూజిస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా విష్ణు మూర్తిని పూజిస్తారు.. మాములుగా హిందూ మతం ప్రకారం రెండు పూజా విధానాలు వాడుకలో ఉన్నాయి. ఒకటి దేవునికి నిన్ను నువ్వు అర్పించుకోవడం,మరొకటి లోతైన భక్తితో కూడిన నిశ్శబ్ద ప్రార్థనతో స్వామి వారిని ఆరాధించడం. అందుకే భగవంతుడిని పూర్తి భక్తితో ప్రార్థించి, అంతరంగాన్ని శుభ్రపరచడానికి అతని నామాన్ని జపించాలి.. ఈయనను గుర్తు చేసుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి.. ఆయన ఎత్తిన అవతారాలకు సంబందించిన పండుగల ద్వారా ఆయనను ఎక్కువగా పూజిస్తారు..

విష్ణువును పూజించడం వల్ల కలిగే ఫలితాల విషయానికి వస్తే. విష్ణువు ఎదుట ఎటువంటి కోరిక లేకుండా ప్రార్థించడం. భగవంతుడే భక్తుని కోరిక తెలుసుకుని తీరుస్తాడు. శ్రీ మహా విష్ణువును పూజించడం వల్ల శాంతి, విముక్తి లభిస్తుంది. విష్ణువును పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేర్చడంతో పాటు కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని నమ్మకం.. అందుకే భక్తులు భక్తి శ్రద్దలతో ఈయనను పూజిస్తారు.. విష్ణువు అనుగ్రహం కలిగితే లక్ష్మీ దేవి అనుగ్రహం కూడా కలుగుతుంది.. అందుకే ప్రత్యేక పండుగల రోజుల్లో ఆయన పూజించడం మర్చిపోకండి..