Site icon NTV Telugu

Tuesday : మంగళవారం కొత్త బట్టలు కొనకూడదా? ఎందుకో తెలుసా?

Hanumanstory

Hanumanstory

మంగళవారం హనుమంతుడికి ఎంతో ప్రీతికరమైన రోజు .. ఈయనను భక్తితో ఆరాధిస్తే ఆయన కష్టాల నుంచి రక్షిస్తాడు. అదేవిధంగా ఈ రోజు చేయకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. మంగళవారం నాడు కొత్త బట్టలను కొనుగోలు చేయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి..  అంతేకాదండోయ్ కొనకూడదు.. అలాగే మంగళవారం కొత్త బట్టలను, లేదా ఏదైనా వస్తువులను ధరించకూడదు అని పండితులు చెబుతున్నారు.. ఎందుకు ఏదైనా బలమైన కారణం ఉందేమో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ రోజు నూతన బట్టలు ధరించడం వల్ల అవి ఇతర కారణాల వల్ల ఏదోలా చిరిగిపోతాయని నమ్ముతారు. అంతేకాకుండా ఈ రోజు ధరించిన నూతన వస్త్రాలు ఎక్కువ రోజులు ఉండవు. శుక్రవారం నూతన బట్టలను కొనుగోలు చేయడం లేదా ధరించడం పవిత్రంగా భావిస్తారు.. శని దేవుడితో సంబంధం ఉన్న మంగళవారం కొత్తగా ఏవి చెయ్యరాదు.. కొత్త బూట్లను, చెప్పులను ధరించకూడదు. నూతన బూట్లు వేసుకోవడం వల్ల గాయాలవుతాయి. అంతేకాకుండా డబ్బు కోల్పోయే ప్రమాదముందని విశ్వసిస్తారు.. లేదా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయట.. అంటే చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయట..
ఇకపోతే అంగారక గ్రహం కూడా చెడు ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇంట్లో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. మంగళవారం రోజు ముఖ్యంగా మసాజ్, మాలిష్ లాంటివి అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఇది ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశముంటుంది..ఈ రోజు ఆర్థిక ఇబ్బందులు కలగకుండా నుదిటిపై బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి…లేదా పసుపును తిలకంగా దిద్దుకోవాలి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా జ్ఞానాన్ని ప్రసాదించే గణేశుని ఆశీర్వాదాలను కూడా పొందుతారు. ఫలితంగా సంపద, శోభ, మానసిక ప్రశాంతతతో పాటు సుఖసంతోషాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.. ఇవి తప్పక పాటించండి..
Exit mobile version