భారతీయులు ఎక్కువగా కొలిచే దేవుళ్లలో ఆంజనేయ స్వామీ కూడా ఒకరు.. పల్లెటూర్లలో ప్రతి ఒక్క ఊరిలో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం లేదంటే గుడి తప్పనిసరిగా ఉంటుంది.. మంగళవారం, శనివారంలలో ఆంజనేయుడిని భక్తితో కొలుస్తారు.. అయితే మామూలుగా మన ఇండ్లలో హనుమంతుని ఫోటోని ఫోటోలు పెట్టుకుని పూజిస్తూ ఉంటారు. కొందరు ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని పూజిస్తే మరి కొందరు గుమ్మానికి ఎదురుగా, ఇంటి బయట పెడుతూ ఉంటారు.. అయితే ఈ ఫోటోను పెట్టాలో తెలుసుకోవడం మంచిది…
ఇకపోతే ఆంజనేయస్వామిని మనోధైర్యం కోసం, నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం పూజిస్తూ ఉంటారు. హనుమంతుడు పట్ల భక్తి కలిగి ఉండేవారు సంపన్నవంతులు అవుతారని, సమస్యల నుండి త్వరగా బయటపడతారని అందరూ నమ్ముతారు. అందుకే ఇంట్లో చాలామంది ఆంజనేయస్వామి చిత్రపఠాలను పెట్టుకొని పూజిస్తూ ఉంటారు. నిజానికి ఆంజనేయ స్వామి కూర్చున్నట్లు ఎరుపు రంగులో ఉండే ఫోటోను దక్షణ దిశలో ఉంచాలి.. అప్పుడే దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయని చెబుతున్నారు..
ఆంజనేయస్వామి బ్రహ్మచారి కాబట్టి ఆంజనేయస్వామి పఠాన్ని పడకగదిలో ఉంచకూడదు. ఇలా చేయటం వలన అశుభం జరుగుతుంది. అదేవిదంగా మీ ఇంట్లో ప్రతికూల శక్తులు ఉన్నాయనిపిస్తే ఇంటి ప్రధాన ముఖద్వారం మీద పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రాన్ని ఉంచవచ్చు.. అలాగే పర్వతాన్ని కూడా ఎత్తినట్లు ఉండే ఫోటోను పెట్టుకోవడం వల్ల ధైర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు.. పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రాన్ని దక్షిణం వైపు ఉండే విధంగా ఉంచడం మంచిది. ఇలా ఉంచటం వలన వాస్తు దోషం నుంచి తప్పించుకోవడం మాత్రమే కాకుండా రోగాల బారి నుంచి కూడా బయటపడవచ్చు… ఏదైనా పని మొదలు పెడితే విజయాన్ని సాధిస్తారని పండితులు చెబుతున్నారు..