భారత దేశంలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి.. ఒక్కో ఆలయానికి ఒక్కో విశిష్టతను కలిగి ఉంటాయి.. వాటిని కళ్ళతో చూస్తే కానీ నమ్మలేము.. ఎంతో గొప్ప మహిమ, పురాతన ఆలయాలు ఎన్నో మన దేశంలో ఉన్నాయి. అలాంటివాటిలో తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ ప్రదేశంలో ఆంజనేయస్వామి దేవాలయం ఒకటి.. ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.. ఈ ఆలయంలో విగ్రహం ఎత్తు రోజు రోజుకూ పెరుగుతోందని అంటారు. ఎందురుగా ఉన్న లక్ష్మీ నరసింహుని గర్భాలయానికి పైకప్పు లేనందువల్ల గతంలో పైకప్పు వేయాలని ప్రయాత్నాలు జరిగాయని కానీ వేసిన కప్పు వేసినట్టుగానే కూలిపోయాయని చెబుతున్నారు ప్రదాన అర్చకులు.
ఇక్కడ అనేక చారిత్రక అవశేషాలు కలవు. ఇది బెంగళూరుకు సుమారు 250కిలోమీటర్ల దూరంలో బెంగళూరు -మధురై జాతీయ రహదారిలో నామక్కల్ క్షేత్రం కొలువై ఉంది.. నామక్కల్ ఆంజనేయస్వామి ఆలయానికి ప్రసిద్ది. ఇక్కడ నిలువెత్తు ఆంజనేయ స్వామి దాదాపు 20అడుగుల ఆంజనేయ విగ్రహంతో ఉండటం వల్ల బాగా ప్రసిద్ది చెందాడు.. ఇక్కడ కొలువై ఉన్న నరసింహ స్వామికి చేతులు జోడిస్తూ దాస్యభావాన్ని ప్రకటిస్తున్నాడు. ఈ ఆంజనేయ స్వామి గర్భగుడికి పైకప్పు లేదు . అందుకు ఆశ్చర్యకరమైన కారణాలున్నాయని అక్కడ దేవాలయ ప్రదాన అర్చకులు చెబుతున్నారు.. మరి ఆ ఆలయం విశేషాలేంటో ఒక్కొక్కటిగా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈ విగ్రహం స్వయంభువు అయినందునే రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారని ఈ విగ్రహం స్వయంభువు అయినందునే రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారని.. అందువల్లే పైన కప్పు వేయడానికి వీలుకాలేదని ఆలయ చరిత్ర చెబుతుంది.. నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఈయన్ను దర్శించుకుంటారు. ఆయన కరుణ ఉంటే శత్రుశేషం, గ్రహ దోషం నుండి ఎలాంటి సమస్యలు ఉండవంటారు. ఆయన చల్లని దీవెనలు మనపై పడితే చాలు జీవితం సుఖసంతోషాలతో వర్ధిళ్లుతారని విశ్వాసం.. కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయని, ప్రతి ఏటా వేల సంఖ్యలో భక్తులు ఇక్కడకు వచ్చి దర్శించుకుంటున్నారు.. తమిళనాడు రాష్ట్రంలో సేలం జిల్లాలో నామక్కల్ లోని ఆంజనేయుడు కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడి ప్రజల సుఖశాంతులను పర్యవేక్షిస్తున్నాడు. ఈ దేవాలయం సుమారు 1500 ఏళ్ల నాటిది అని ప్రజలు చెబుతున్నారు..