Site icon NTV Telugu

Sunday : ఆదివారం ఇలాంటి పనులు అస్సలు చెయ్యకండి.. మహా పాపం..!

Sunday

Sunday

హిందువులు ఒక్కోరోజు ఒక్కో దేవుడిని పూజిస్తారు.. అదే విధంగా ఆదివారం కు కూడా సూర్యదేవుని రోజుగా పరిగణిస్తారు. ఈ రోజు చాలా మంది సూర్య భగవానుడి భక్తులు ఆదివారం ఉపవాసం ఉంటారు.. అందుకే ఈరోజు చాలా పవిత్రంగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.. ఆదివారం ఏం చెయ్యాలి? ఏం చెయ్యకూడదో? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం

నిజానికి సూర్యడు అధిపతిగా ఉన్న రోజే ఆదివారం. ఇక సూర్యాష్టకం అనేది ఉంది. రెండు శ్లోకాలు అందులో తెలపబడ్డాయి. అందులో ఫస్ట్ ది అమిషా మధుపానం జన్మజన్మ దరిద్రతా.. అంటే ఆదివారం రోజు మాంసం తిన్నా, మద్యం సేవించినా ఏడు జన్మల వరకు రోగస్తులు అవుతారు. జన్మజన్మలకు దరిద్రాన్ని అనుభవిస్తారు. అందుకోసం ఆదివారం నాడు మద్యం సేవించడం, మాంసహారం అస్సలు తీసుకోకూడదు అని పెద్దలు చెబుతున్నారు..

అంతేకాదు ఈరోజు తలకు నూనె పెట్టుకొని తల స్నానం చెయ్యకూడదు.. వ్యాధులు అనేవి రావు. అసలు దరిద్రం అనేది ఉండదు. ప్రధానంగా ఆదివారం రోజు ఉన్నత పదవులు చేపట్టడం ఉద్యోగం లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి పైఅధికారులకి చెప్పడం ప్రభుత్వ కార్యకలాపాలు, బంగారం కొనుగోలు చేయడం, కోర్టు సమస్యలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, కుటుంబపరమైన సమస్యలు, వ్యాపార సామాగ్రిని కొనుగోలు చేయడం, వ్యవసాయ సామాగ్రిని కొనడం వంటి పనులు పొరపాటున కూడా చెయ్యకండి.. ఈరోజు మీకు వీలైతే రామాయణం చదవడం చాలా మంచిది.. మీకు తోచిన సాయాన్ని చెయ్యడం మంచిది..

Exit mobile version